News
News
X

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

(Alluri Movie) అల్లూరి సినిమా టీజర్ విడుదలైంది. చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.

FOLLOW US: 

(Alluri Movie Teaser) అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నాడు ‘అల్లూరి’ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అల్లూరి సీతారామరాజుగా శ్రీ విష్ణు నటించారు. ఇదేమో అల్లూరి జీవిత చరిత్ర అనుకుంటున్నారా? కాదు, హీరోకి ఆ పేరు పెట్టారంతే. ఇందులో శ్రీ విష్ణు పవర్ ఫుల్ పోలీసుగా కనిపించబోతున్నాడు. ఒక నిమిషం ఇరవై సెకన్ల నిడివి ఉన్న టీజర్లో శ్రీ విష్ణును చూస్తూ అలా ఉండిపోతారంతా. ఆయన ఇంతవరకు చేసిన సినిమాల్లో ఆకతాయిగా కనిపించాడు, సీరియస్ గా ఉండే క్యారెక్టర్లు చేశారు. కానీ ఇంత పవర్ ఫుల్ పోలీస్ గా చేయలేదు. కోర మీసాలతో టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు శ్రీవిష్ణు. 

‘ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్... పోలీస్ బయల్దేరాడు రా’ డైలాగుతో శ్రీ విష్ణు ఎంట్రీని చూపించారు. టీజర్ లో ఎన్నో షాట్లు ఉన్నప్పటికీ ఎవరు విలన్,ఎవర ఏ పాత్ర అనేది రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. టీజర్ చూస్తుంటే ఇది ఈనాటి కథ కాదనిపిస్తుంది. ఎప్పుడో 20 లేదా 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితుల నేపథ్యంలో తీసిన కథలా కనిపిస్తుంది. నక్సల్స్ ను కూడా టీజర్లో చూపించారు. దీన్ని బట్టి ఈ కథ 1980 తరువాత 1995 కి ముందు మధ్య సాగే కథ కావొచ్చని భావిస్తున్నారు. ఈ టీజర్లో అన్నీ మగ క్యారెక్టర్లే కనిపించాయి. లేడీ పాత్రలు ఒక్కటి కూడా కనిపించలేదు. హీరోయిన్ లేదేమో అన్న సందేహం కూడా వస్తోంది. 

టీజర్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పవచ్చు. శ్రీ విష్ణు కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోయే మూవీగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాకు హర్షవర్ధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరించారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.  

[yt]

View this post on Instagram
 
A post shared by Sree Vishnu (@sreevishnu29)

Published at : 04 Jul 2022 11:48 AM (IST) Tags: Alluri Movie Teaser Sree Vishnu Alluri Kayadu Lohar Alluri Alluri Movie

సంబంధిత కథనాలు

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాప్ స్టోరీస్

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!