News
News
X

Anasuya Bharadwaj: కోడలైనా సరే నన్ను అత్త అనకూడదు - అనసూయ

హాట్ యాంకర్ అనసూయ.. మరోసారి ‘ఆంటీ’ వివాదంపై స్పందించింది. సుమ కనకాల వంటల కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ తను ఏం అన్నదంటే..?

FOLLOW US: 

జబర్దస్ కామెడీ షోతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ఆ షోకు సంబంధించి వందల ఎపిసోడ్లకు యాంకర్ గా చేసి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత యాంకరింగ్  పక్కన పెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది. బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ యువతను గిలిగింతలు పెట్టింది.  నెమ్మదిగా పలు సినిమాల్లో లీడింగ్ రోల్స్ చేస్తోంది. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా తెరకెక్కింది. అటు ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. వెండితెర ఆఫర్స్ వరుసబెట్టి వస్తున్న తరుణంలో అనవసర వివాదాల్లో తల దూర్చి అనసూయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 

‘లైగర్’ మూవీ ఫెయిల్యూర్ తర్వాత ఈ అమ్మడు ‘ఆంటీ’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.  లైగర్ ఫ్లాప్ ను ఎంజాయ్ చేస్తూ  పరోక్షంగా ట్వీట్ వేసి అనసూయ వివాదానికి కారణం అయ్యింది.  విజయ్ దేవరకొండను కర్మఫలం వెంటాడిందని..  అందుకే లైగర్ ప్లాప్ అయ్యింది అని అర్థం వచ్చేలా  ట్వీట్ చేసింది. దీంతో ది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నటుడు బ్రహ్మాజీ సైతం అనసూయపై ఇండైరెక్ట్ సెటైర్ వేశాడు.  

తాజాగా అనసూయ.. యాంకర్ సుమ నిర్వహించే ‘క్రేజీ కిచన్’ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నది. చాలా మంది తనకు వంటలు రావని అందరూ అనుకుంటారని.. కానీ, తాను చాలా బాగా వంటలు చేస్తానని చెప్పింది. ఈ షోలో తాను బాగా వంట చేస్తానని ఈ షోలో నిరూపించనున్నట్లు చెప్పింది. మాటలో మాటగా ఆంటీ అనే విషయం మళ్లీ ముందుకు వచ్చింది. వాతావానికి “అత్తా, పిత్తా అనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చివరికి నా కోడలు కూడా నన్ను అత్త అని పిలవడం ఇష్టం ఉండదు. జస్ట్ అను అని పిలిస్తే చాలు” అని చెప్పింది. గురువారం ఈ కార్యక్రమం సుమ యూట్యూబ్ చానెల్ లో ప్రసారం కానుంది.

View this post on Instagram
 
A post shared by Suma Kanakalla (@kanakalasuma)

మరోవైపు తన ఆంటీ వివాదం మూలంగా అనసూయ పలు అవకాశాలను కోల్పోయినట్లు తెలుస్తున్నది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘పుష్ప-2’ నుంచి తనని తప్పించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె ప్లేస్ లో మరో నటిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు ‘పుష్ప’ సినిమాలో సునీల్ భార్య దాక్షాయనిగా నటించి ఆకట్టుకుంది. అటు మరో ఇద్దరు దర్శకులు కూడా ఆమె తమ ప్రాజెక్టుల నుంచి తొలగించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.  ఈ వార్తలు వాస్తవమేనా? అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.

Also Read : ఆస్కార్ బరిలో నిలిచిన ‘చల్లో షో’ కథ ఏంటీ? అందుకే, ఆ చిత్రానికి అంత హైప్?

Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

Published at : 21 Sep 2022 06:12 PM (IST) Tags: Anasuya Anasuya bharadwaj Suma Kanakala Crazy Citchen

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?