Amrita Rao: 'సరోగసీ'తో బిడ్డను కోల్పోయా - మహేష్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
అమృతారావు, ఆర్జే అన్మోల్ కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను మొదలుపెట్టారు. దానికి 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పేరు పెట్టారు.
టాలీవుడ్ లో 'అతిథి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అమృతారావు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అతిథికి తెలుగులో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో మాత్రం ఈమె కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. దీంతో అక్కడ అవకాశాలు బాగానే వచ్చాయి. కొన్నాళ్లకు ఆర్జే అన్మోల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటైంది. అయితే పిల్లల విషయంలో వీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామని చెబుతున్నారు.
అమృతారావు, ఆర్జే అన్మోల్ కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను మొదలుపెట్టారు. దానికి 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పేరు పెట్టారు. ఈ ఛానెల్ లో తమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటుంది ఈ జంట. ఈ క్రమంలో ప్రెగెన్సీ కోసం పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రెగ్నెన్సీ కోసం స్ట్రగుల్ అయ్యామని చెప్పుకొచ్చింది ఈ జంట.
ప్రెగ్నెన్సీ కోసం చాలా మెథడ్స్ ప్రయత్నించామని.. సరోగసి, ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద ఇలా అన్ని విధాలుగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యామని చెప్పుకొచ్చారు. డాక్టర్లుగా చెప్పినట్లుగా ఫాలో అయినా వర్కవుట్ అవ్వలేదని.. ఫైనల్ గా సరోగసీకి వెళ్లామని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు సరోగేట్ మదర్ కి సంబంధించిన లక్షణాలే ఎక్కువ వస్తాయని తెలిసినా.. ఆ పద్దతి ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమయ్యామని చెప్పారు.
కానీ కొన్నిరోజులకే ఆ బిడ్డ చనిపోయిందని.. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యామని తెలిపారు. కానీ మన చేతిలో ఏదీ ఉండదనుకొని ఆ తరువాత ఐవీఎఫ్ ప్రాసెస్ కి వెళ్లామని.. అది కూడా వర్కవుట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆయుర్వేదం ట్రై చేస్తే తన శరీరం మొత్తం రాషెస్ వచ్చాయని గుర్తుచేసుకుంది అమృతారావు. చాలా ఏళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2020లో తనకు ప్రెగెన్సీ వచ్చిందని.. అదే ఏడాది నవంబర్ లో తమకు 'వీర్' అనే బిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చారు.
Also Read: 'ఆచార్య' సెన్సార్ రివ్యూ - హైలైట్ ఎపిసోడ్స్ ఇవే
so Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ
View this post on Instagram