అన్వేషించండి
Allu Arjun: నా ఫ్యాన్సే నా బలం, వారే నా ఇన్స్పిరేషన్ - 'గని' స్టేజ్ పై బన్నీ స్పీచ్
ఏప్రిల్ 8న 'గని' సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం.

'గని' స్టేజ్ పై బన్నీ స్పీచ్
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం.
ఈ క్రమంలో వైజాగ్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అరవింద్, అవంతి శ్రీనివాస్ వంటి వారు కూడా గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా అల్లు అరవింద్ 'గని' సినిమా బాగా వచ్చిందని.. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఇదే సమయంలో తన కొడుకు అల్లు అర్జున్ గురించి గొప్పగా మాట్లాడారు.
ఆ తరువాత వరుణ్ తేజ్.. తనపై ఏ ప్రొడ్యూసర్ పెట్టనన్ని డబ్బులు 'గని' నిర్మాతలు పెట్టారని.. కచ్చితంగా ప్రతీ రూపాయి ఈ సినిమా రాబడుతుందని నమ్మకంగా చెప్పారు. ఫైనల్ గా అల్లు అర్జున్ తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. వరుణ్ తేజ్ అంటే చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టమని.. పుట్టుకతోనే అందగాడు అంటూ చెప్పుకొచ్చారు.
సినిమా సినిమాకి అతడు చూపించే వేరియేషన్ అద్భుతమని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అన్నారు. సిక్స్ ప్యాక్ లు చేస్తూ.. బాడీ మెయింటైన్ చేస్తూ.. ఇన్నాళ్లు ఒక సినిమా కోసం కష్టపడడం మాములు విషయం కాదని అన్నారు. ఈ సినిమా తను చూశానని.. తనకు బాగా నచ్చిందని అన్నారు. దర్శకుడు కొత్తవాడైనప్పటికీ.. అనుభవం ఉన్నట్లుగా డైరెక్ట్ చేశారని అన్నారు. ఇదే సమయంలో తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కి హీరోనే బలమని.. కానీ తనకు మాత్రం అభిమానులే బలమని చెప్పారు. తన ఫ్యాన్స్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారని.. అవి తనను బాగా ఇన్స్పైర్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?
Icon St𝔸𝔸r @alluarjun Speaking Live now at #GhaniPreReleaseEvent 🤩
— GA2 Pictures (@GA2Official) April 2, 2022
- https://t.co/7gn1YDDtDl #GhaniFromApril8th 👊#Ghani 🥊 @IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/lEBQ6ac105
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్





















