News
News
X

Allu Arjun: ‘పుష్ప’ క్రేజ్‌తో బన్నీకి హాలీవుడ్ ఆఫర్, ఇంతకీ స్టైలిష్ స్టార్ ఓకే చెప్పాడా ?

పుష్ప విజయం తర్వాత బన్నీకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అమెరికాకు వెళ్లిన బన్నీని ఓ హాలీవుడ్ దర్శకుడు కలిసి తన సినిమాలో నటించాల్సిందిగా కోరారట. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.

FOLLOW US: 

Stylish Star Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో బన్నీ అద్భుత నటనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.  తన లుక్, క్యారెక్టరైజేషన్ చూసి ప్రేక్షకుల మైమరచిపోయారు. సినీ అభిమానులే కాదు.. పలువురు దర్శక నిర్మాతలు సైతం బన్నీ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.

న్యూయార్క్ లో బన్నీని కలిసి హాలీవుడ్ డైరెక్టర్

పుష్ప సినిమా తర్వాత ఆయనకు బాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి సైతం క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో జరిగిన ఇండియా డే పరేడ్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆయనతో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి సైతం ఈ ఇండియా పరేడ్ డేలో పాల్గొన్నారు. అదే సమయంలో ఓ హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు.. బన్నీతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బన్నీ కోసం తన తదుపర స్టోరీలో ఓ పవర్‌ ఫుల్‌ పాత్రను రూపొందించారట. ఇటీవల బన్నీ న్యూయార్క్‌ పర్యటనకు వెళ్లడంతో.. ఈ విషయాన్ని  తెలుసుకుని మరీ అతడిని ప్రత్యేకంగా కలిశారట. తన సినిమా గురించి ఆయనతో చర్చించినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బన్నీ మాత్రం ఈ సినిమా డిస్కర్షన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పుష్ప-2 మీదే ఫుల్ ఫోకస్

పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప-2 సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్. బన్నీ సైతం ప్రస్తుతం ఈ సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌ లో జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ‘పుష్ప’  సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా వ్యాప్తి తర్వాత వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన ప్రేక్షకులను మెప్పించారు. అటు ఈ సినిమాలో ప్రధానంగా లొకేషన్స్  బాగా ఆకట్టుకున్నాయి.

పుష్ప సీక్వెల్ అంతకు మించి అన్నట్లుగా ఉండాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నారు. అటు పుష్ప ఘన విజయం సాధించడంతో పుష్ప 2పై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజిలో అంచనాలు పెట్టుకున్నారు.  వీరి అంచనాలకు తగ్గట్టుగా సుకుమార్ ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బన్నీకి తోడుగా రష్మిక నటిస్తుందట. ఇందులో పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) - భన్వర్‌ సింగ్‌ శెకావత్‌కు (ఫహద్‌ ఫాజిల్‌) మధ్య గొడవలను ప్రత్యేకంగా చూపించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ  చిత్రం రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లొకేషన్స్ సహా అన్ని అరేంజ్ మెంట్స్ చేసుకున్నారు సుకుమార్. షూటింగ్ మొదలు కావడమే ఆలస్యం చకచకా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు.

Published at : 29 Aug 2022 02:41 PM (IST) Tags: Allu Arjun Pushpa 2 Hollywood offer US Director

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!