News
News
వీడియోలు ఆటలు
X

Allu Arjun-NTR: బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అల్లు అర్జున్, ఎన్టీఆర్?

బాలీవుడ్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ పౌరాణిక మూవీ కోసం టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు పరిశీలిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్ లో ఒకరిని హీరోగా ఫిక్స్ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ తెరకెక్కుతున్న బడా ప్రాజెక్టులకు టాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. తాజాగా బీటౌన్ లో ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ అనే చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్  ఆదిత్య ధ‌ర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ మైఠలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోల పేర్లను ఆయన పరిశీలిస్తున్నారట. అందులో ఒకరు అల్లు అర్జున్ కాగా, మరొకరు జూనియర్ ఎన్టీఆర్.

పరిశీలనలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లు

‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు జూ. ఎన్టీఆర్. అలాగే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటారు అల్లు అర్జున్. వీరుకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకరిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని ఆదిత్య ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా గురించి బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో ‘ఉరి’ హీరో విక్కీ కౌశల్ ను హీరోగా తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరినీ పక్కన పెట్టేశారు. బన్నీ లేదంటే ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీరికున్న క్రేజ్ ను ఉపయోగించుకుని దేశ వ్యాప్తంగా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు.  

ప్రతిష్టాత్మక చిత్రంలో ఛాన్స్ కొట్టేది ఎవరు? 

సూపర్ హిట్ చిత్రం ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ తెరకెక్కించిన తర్వాత ఆదిత్య ధర్  ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే డ్రీమ్ ప్రాజెక్టు చేపట్టారు. గతంలో ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించేందుకు ఓకే చెప్పారు. ఆ సమయంలో విక్కీ కౌషల్ ను హీరోగా అనుకున్నారు. అయితే, కారణాలు బటయకు తెలియకపోయినా, ఈ ప్రాజెక్టు నుంచి రోనీ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ఆ సమయంలో హీరోగా రణ్ వీర్ సింగ్ ను తీసుకోవాలి అనుకున్నారు.  తాజాగా వీరి స్థానంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వత్థామ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో  సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

‘RRR’ చిత్రం తర్వాత జూ. ఎన్టీఆర్ కు మంచి మైలేజ్ వచ్చింది. పాన్ ఇండియన్ మార్కెట్ లో బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.  యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read Also: ‘బాహుబలి‘ రేంజిలో తెరకెక్కుతున్న సూర్య లేటెస్ట్ మూవీ, టైటిల్ ఫిక్స్, విడుదల ఎప్పుడంటే?

Published at : 16 Apr 2023 11:25 AM (IST) Tags: Allu Arjun NTR The Immortal Aswathama Adithya Dhar

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా