Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
అక్షయ్ కుమార్ కి సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ ఇష్యూకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీ గొప్పదా..? నార్త్ ఇండస్ట్రీ గొప్పదా..? అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కిచ్చా సుదీప్ హిందీ భాషపై చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. ఈ విషయంపై అజయ్ దేవగన్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు సౌత్ ఇండస్ట్రీని పొగుడుతూ బాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ వివాదంపై స్పందించారు.
ఆయన నటించిన 'పృథ్వీరాజ్' సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ కి సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ ఇష్యూకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీని సౌత్, నార్త్ అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఏ సినిమా అయినా.. బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడితే చాలని అన్నారు. బ్రిటీష్ పాలకులు ఇండియాను విభజించి పాలించారని.. ఇప్పటికీ దాని నుంచి మనం ఏదీ నేర్చుకోవలేదనిపిస్తుందని చెప్పారు. ఉన్నది ఒకటే ఇండస్ట్రీ అని.. దాన్ని మరింత బెటర్ గా చేయడానికి అందరం కలిసి పని చేయాలని అన్నారు. అంతేకానీ.. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ ని మాట్లాడితే తనకు అసలు నచ్చదని స్పష్టం చేశారు.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
View this post on Instagram