Mister Pellam Episode 4: ఆదిత్య జిమ్‌లో చేరిన భవ్య- పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న సంధ్య
ఆహాలో తొలిసారిగా ప్రసారమవుతోన్న డైలీ వెబ్ సిరీస్ 'మిస్టర్ పెళ్ళాం'. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ నటిస్తున్న మరొక విభిన్నమైన సిరీస్ మిస్టర్ పెళ్ళాం. డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని కలలు కంటాడు. మన హీరో గారికి ఇద్దరు అమ్మాయిలు తగులుతారు. ఒకరేమో గుండమ్మ కథ సీరియల్ లో నటించిన పూజా మూర్తి. మరొకరు సోనియా. ఆహాలో ప్రసారమవుతోన్న ఈ మిస్టర్ పెళ్ళాం డైలీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
భవ్య(గుండమ్మ కథ హీరోయిన్) మన హీరో గారు ఆదిత్యని చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతుంది. ఎలాగైనా తననే జీవిత భాగస్వామిగా చేసుకోవాలని కలలు కంటుంది. అటు ఆదిత్య సంధ్యని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. సోనీ బాగా డబ్బున్న అమ్మాయి. భవ్య వాళ్ళ అమ్మ పోలీస్ అధికారి. తన దగ్గర పని చేసే అమ్మాయే ఆదిత్య ప్రేమించిన సంధ్య. అయితే సంధ్య ఖరీదైన కారులో తిరగడం చూసి తను కోటీశ్వరురాలు అనుకుంటాడు. ఎలాగైనా తనని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు.
ఇక భవ్య ఆదిత్యని బుట్టలో వేసుకునేందుకు ట్రై చేస్తుంది. ఆదిత్య పని చేస్తున్న జిమ్ లో చేరేందుకు వస్తుంది. ఆస్తిపరురాలు అని చెప్పకుండా గరీబు వాళ్ళం అని ఆదిత్యతో చెప్తాడు. ఆదిత్య ఫ్రెండ్ సుబ్బు తనని హేళనగా మాట్లాడతాడు. భవ్య తన తల్లి, తండ్రి గురించి అబద్ధాలు చెప్తుంది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేద్దామని వెళ్తే వెయిట్ ఎక్కువగా ఉన్నానని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. జిమ్ చేసి బరువు తగ్గుదామని వచ్చాను అని చెప్తుంది. జిమ్ ఫీజు దగ్గర బేరాలు కూడా ఆడేస్తుంది. అలా ఎందుకు బేరాలు ఆడావ్ అని భవ్య ఫ్రెండ్స్ అడుగుతారు. డబ్బు కాకుండా నన్ను నన్నుగా చూసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నా అందుకే అలా అబద్ధం చెప్పానని అంటుంది.
Also Read: 'వేద నా దేవత' అని ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- భర్తని అపురూపంగా చూసుకున్న వేద
ఆదిత్య తండ్రి కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటాడు. కొడుక్కి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంటాడు. అటు సంధ్య కష్టపడి పని చేస్తూ తండ్రికి అండగా నిలుస్తుంది. తనకి పెళ్లి చెయ్యాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సంధ్య చెప్తుంది. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని తల్లిదండ్రులు నచ్చజెప్పడానికి చూస్తారు. ఆ మాట విని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కానీ ఒక కండిషన్ పెడుతుంది. ఇల్లరికం వచ్చే అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను లేదంటే అసలు పెళ్ళే చేసుకొను అని సంధ్య చెప్పేస్తుంది.
కోటీశ్వరురాలిని పెళ్లి చేసుకుని కోట్ల రూపాయలు అనుభవించాలని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. డబ్బు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. పెళ్లి సంబంధం చూశానని తండ్రి ఆదిత్యతో చెప్తాడు. ఇక సంబంధాలు చూడాల్సిన పని లేదని తను ఒక అమ్మాయిని సెట్ చేసుకున్న అని చెప్తాడు. ఆ అమ్మాయితో మన దరిద్రాలు అన్ని సెట్ అయిపోయాయి అని తెగ చెప్పేస్తాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ డౌట్ గా చూస్తారు. భవ్యకి కూడా సంబంధాలు చూస్తూ ఉంటారు. పెళ్లి చూపులు చూసుకోవడానికి సందీప్ అనే అబ్బాయి వస్తున్నాడని భవ్యకి తల్లి చెప్తుంది. ఆ మాట వినగానే టెన్షన్ పడుతుంది. పరిస్థితి చెయ్యి దాటక ముందే ఆదిత్యకి ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటుంది.
Also Read: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్