By: ABP Desam | Updated at : 07 Apr 2023 12:43 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Shakeela/Instagram
Actress Shakeela : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు శృంగార తారగా నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు షకీలా. అలాగే ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేశారు. అంతేకాదు దర్శకురాలిగానూ పలు సినిమాలు చేసి మెప్పించారామే. ఒకానొక సమయంలో హీరోయిన్ లతో సమానంగా పారితోషికం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతగా ఆమెకు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే షకీలా తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ షకీలా చేసిన పనికి మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్మెంట్ యాజమాన్యం నివాసితుల వద్ద నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా డబ్బులు కట్టకపోతే నీళ్లు రాకుండా నిలిపేయడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఒక్కో మనిషి వద్ద బలవంతంగా దాదాపు 9 వేలు వసూలు చేయడంతో అక్కడి వారంతా లబోదిబోమంటున్నారు. డబ్బులు కట్టేది లేదని ఎట్టకేలకు ఆందోళనకు దిగారు వారంతా. అయితే వారికి షకీలా అండగా నిలిచారు. వారితో ఆమెకు ఎలాంటి పరిచయం లేకపోయినా మద్దతు ప్రకటించారు. వారు నిరసన చేసే ప్రదేశానికి వెళ్లి సపోర్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె చేసిన పనిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసిని షకీలా ఎంతో క్రేజ్ సంపాదించింది. చాలా వరకూ ఆమె అలాంటి సినిమాలే చేశారు. అయితే గత కొన్నేళ్లుగా అడల్ట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడుప్పుడూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత షకీలా టాలీవుడ్ లో స్క్రీన్ మీద కనిపించింది. గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించి కొంత డబ్బు సంపాదించినా చాలా వరకూ పోగొట్టుకున్నానని చెప్పింది. తన సోదరి ఒకావిడ తన వద్ద 2 కోట్లు రూపాయలు తీసుకొని ఇవ్వకుండా మోసం చేసిందని వాపోయింది. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదని, కానీ ఆమె తనతో మాట్లడటం కూడా మానేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బయట వాళ్లు కంటే ఇంట్లో వాళ్ల చేతిలోనే తాను మోసపోయినట్టు తెలిపింది. తను కుటుంబ సభ్యులు కూడా తనతో మాట్లాడటం లేదని, తాను ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది షకీలా.ః
Read Also: గలీజ్ కంటెంట్ ఆగాల్సిందే, ఓటీటీకి సెన్సార్‌షిప్‌పై సల్మాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు
Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌తో సత్కారం
Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?
SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు