Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఓ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను హీరోయిన్ గా సక్సెస్ కాకాపోయుంటే ఏం చేసేదాన్ని అనే విషయం పై మాట్లాడింది.
Rakul Preet Singh: టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రకుల్ ఈ మధ్య సౌత్ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఓ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను హీరోయిన్ గా సక్సెస్ కాకపోయుంటే ఏం చేసేదాన్ని అనే విషయం పై మాట్లాడింది. ప్రస్తుతం రకుల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అదృష్టం కొద్దీ అలా జరగలేదు: రకుల్ ప్రీత్ సింగ్
తన ఫ్యామిలీ ముంబైకు మారినపుడు తన వయసు 20 ఏళ్లు అని చెప్పింది. అయితే తాను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ ను అని తెలిపింది. తనకు ముందు నుంచీ సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తానని ఇంట్లో చెప్పానని, అలా రెండేళ్లు ప్రయత్నాలు చేస్తానని కుదరకపోతే తిరిగి వచ్చి చదువుతానని ఇంట్లో చెప్పానని చెప్పింది. తాను గ్రాడ్యుయేట్ పూర్తి చేయడానికి కూడా అదే కారణమని పేర్కొంది. అయితే కొంత మంది సన్నిహితులు మోడలింగ్ చేస్తే హీరోయిన్ గా తొందరగా అవకాశాలు వస్తాయని సలహా ఇచ్చారని చెప్పింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తాను ఎంబిఏ(ఫ్యాషన్) చేద్దామని నిర్ణయించుకున్నానని, అదే తన ‘ప్లాన్-బి’ అని పేర్కొంది. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదని, తన ప్రయత్నాలు ఫలించి 18 ఏళ్ల వయసులోనే సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పింది. తనది ఆర్మీ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవాటు అయిందని, అందుకే తన కెరీర్ ను తీర్చిదిద్దడంలో అది చాలా ఉపయోగపడిందని పేర్కొంది.
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో గుర్తింపు..
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. దక్షిణాదిన కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ కన్నడ సినిమా ‘గిల్లీ’తో సినిమా రంగంలో అడుగు పెట్టింది. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు సినిమాలు చేస్తూనే చదువును పూర్తి చేసింది రకుల్. కన్నడ సినిమా తర్వాత తెలుగులో ‘కెరటం’ సినిమాలో నటించింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. తర్వాత వరుసగా 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'ధ్రువ', 'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది రకుల్. తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. గతేడాది ఐదు హిందీ సినిమాల్లో నటించింది రకుల్. ఈ ఏడాది కూడా రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘బూ’ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదల అయింది.
Also Read : నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్‌ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?