Actress Nithya Menon:టీచర్‌గా మారిన నిత్యా మీనన్ - తెలుగులో విద్యార్థులకు పాఠాలు
నటి నిత్యా మీనన్ స్కూల్ టీచర్ గా మారింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తోంది నటీ నిత్యా మీనన్. మంచి కథా బలమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో బాగా ఆకట్టుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది.
నిత్య సరికొత్తగా న్యూ ఇయర్ వేడుకలు
చాలా మంది నటీమణులు కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని భారీగా డబ్బు సంపాదిస్తారు. అలా సంపాదించడం ఇష్టం లేని వాళ్లు పబ్బుల్లోనో, స్పెషల్ ఈవెంట్స్ లోనో పాల్గొని సరదాగా గడుపుతుంటారు. కానీ, తాను అందరిలా కాదంటోంది నిత్యా మీనన్. కొత్త సంవత్సరం సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గడిపింది.
ఏపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు
ఓ మూవీ షూటింగ్‌లో షూటింగ్‌లో భాగంగా నిత్యా మీనన్ ఏపీలోని కృష్ణాపురం గ్రామానికి వచ్చింది. షూటింగ్ పూర్తి కాగానే, దగ్గరున్న ఓ గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లింది. అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా గడిపింది. ఆ తర్వాత పిల్లలందరినీ కూర్చు బెట్టుకుని ఇంగ్లీష్ పాఠం చెప్పింది. విద్యార్థులకు అర్థం అయ్యేలా తెలుగులో వివరించింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
View this post on Instagram
నా కొత్త సంవత్సరం ఇలా గడిచింది!
‘‘కృష్ణాపురం గ్రామంలోని చిన్నారులతో నా కొత్త సంవత్సరం ఇలా గడిచింది. గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ సంతోషంగా ఉన్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నిత్య మీనన్ ఎంత బాగా తెలుగు మాట్లాడుతోంది. విద్యార్థులు కూడా చాలా చక్కగా వింటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
Read Also: వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అదిరిందిగా!