Lavanya Tripathi Marriage : తెలుగింటి కోడలు కాబోతున్న లావణ్యా త్రిపాఠి - ఆ హీరోతో పెళ్లి!
లావణ్యా త్రిపాఠి త్వరలో పెళ్లి కబురు చెప్పనున్నారా? ఆ హీరోతో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నారా? అంటే... 'అవును' అంటున్నారు.
లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ఇంట్లో పెళ్లి భజంత్రీలు వినిపించే రోజు చాలా దగ్గరలో ఉందా? తెలుగులో అగ్ర కుటుంబానికి చెందిన కథానాయకుడితో ఆమె ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారా? త్వరలో ఆ పెళ్లి (Lavanya Tripathi Marriage) కబురు చెప్పనున్నారా? అంటే... 'అవును' అని తెలుగు చిత్రసీమలోని వర్గాలు చాలా నమ్మకంగా చెబుతున్నాయి.
పెళ్లికి లావణ్య రెడీ!
లావణ్యా త్రిపాఠి తల్లిదండ్రులు డెహ్రాడూన్‌లో ఉంటారు. వాళ్ళది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ కుటుంబం. లాయర్లు, సివిల్ సర్వెంట్స్ ఉన్న ఫ్యామిలీ. లావణ్య ఒక్కరే సినిమా పరిశ్రమ వైపు వచ్చారు. హిందీ బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారు. 'అందాల రాక్షసి' నుంచి 'హ్యాపీ బర్త్ డే' వరకు పలు సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. గత కొన్ని రోజులుగా లావణ్యా త్రిపాఠి ఓ హీరోతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ ఆమె ఖండించినది లేదు. అలాగని, అవునని అంగీకరించినదీ లేదు. త్వరలో పెళ్లి కబురుతో తమ ప్రేమ బంధాన్ని పీటల వరకు తీసుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట.
ఇటీవల ఓ యువ హీరో తండ్రి త్వరలో తమ కుమారుడి పెళ్లి అని ప్రకటించారు. ఆ పెళ్లి కుమార్తె లావణ్యా త్రిపాఠి అని విశ్వసనీయ వర్గాల కథనం. ఆ మధ్య యువ కథానాయకుడు రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో పెళ్లి కబురు ఏ విధంగా అయితే అనౌన్స్ చేశారో... ఆ విధంగా లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోయే హీరో తమ ప్రేమ పెళ్లి కబురు చెబుతారని టాక్. ఈ హీరో హీరోయిన్ల ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించారట.
ప్రేమపై లావణ్య అభిప్రాయం ఏమిటంటే?
తాను ప్రేమలో ఉన్నట్టు లావణ్యా త్రిపాఠి ఎప్పుడూ చెప్పలేదు. కానీ, గతంలో ఓసారి ప్రేమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తాను నమ్మనని ఆమె తెలిపారు. అబ్బాయిని ప్రేమించాలా? వద్దా? అనేది అతనితో మాట్లాడి, కొంత సమయం గడిపితే గానీ చెప్పలేనని... మాట్లాడటం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. తనకు పెళ్లి మీద నమ్మకం ఉందని లావణ్యా త్రిపాఠి చెప్పారు. అయితే... ప్రస్తుతం తాను సింగిల్ అన్నారు. అందుకు కారణం సరైన జీవిత భాగస్వామి లభించలేదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. అదీ సంగతి!
Also Read : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
లావణ్య త్రిపాఠికి ఆ హీరో ప్రపోజ్ చేయనున్నారని గతంలో ఓసారి వార్తలు వచ్చాయి. స్పెషల్ అకేషన్ కోసం ఇద్దరూ బెంగళూరు వెళుతున్నారనీ ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. అప్పుడు లావణ్య త్రిపాఠి చాలా తెలివిగా తాను డెహ్రాడూన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లావణ్యా త్రిపాఠి స్నేహితులు వాళ్ళే!
ఖాళీగా ఉన్నప్పుడు లావణ్యా త్రిపాఠి ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తారు? తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్రెండ్స్ ఎవరు? అని అడిగితే... ''నిహారిక, రీతూ వర్మ, సందీప్ కిషన్, అల్లు శిరీష్'' అని లావణ్యా త్రిపాఠి చెప్పారు. అందులో చాలా మంది తన కో స్టార్స్ అని ఆమె అన్నారు.
Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్