NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
NTR 32 In Prashanth Neel Direction: సోషల్ మీడియాలో ఉదయం ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran NTR Jr Movie)తో పాన్ ఇండియా సినిమా ప్లానింగులో ఉందని! అసలు నిజం ఏంటంటే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పేరు ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది కూడా హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో కాదు... మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో! మరీ ముఖ్యంగా చెన్నైలో! ఎన్టీఆర్ హీరోగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran NTR Jr Movie) సినిమా ప్లాన్ చేస్తున్నారని చెన్నై జనాలు ఒకటే హోరెత్తిస్తున్నారు.
ధనుష్, ఎన్టీఆర్ హీరోలుగా...
వెట్రిమారన్ సినిమాలో నిజమెంత?
రజనీకాంత్ అల్లుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్, మన ఎన్టీఆర్ కథానాయకులుగా వెట్రిమారన్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. అది కూడా రెండు పార్టులు సినిమా చేయనున్నారని, మొదటి పోర్టులో ఎన్టీఆర్ హీరో అయితే... రెండో పార్టులో ధనుష్ హీరో అనేది సదరు వార్తల సారాంశం. అయితే... అందులో నిజం లేదనేది ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెప్పే మాట.
నిజం చెప్పాలంటే... ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలని వెట్రిమారన్ రెండు మూడు ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు. ముందు 'ఆర్ఆర్ఆర్', ఆ తర్వాత కొరటాల శివ సినిమాలు ఉండటంతో ఎన్టీఆర్ ఓకే చెప్పలేదు. డిస్కషన్స్ జరిగాయి కానీ సినిమా కన్ఫర్మ్ కాలేదు.
తెలుగోడితో ఎన్టీఆర్ 32...
రెండు పార్టులుగా సినిమా!
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్నది ఆయనకు 30వ సినిమా. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ ఇయర్ ఎండ్ ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే!
ఎన్టీఆర్ సినిమాను రెండు పార్టులుగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే... తారక్ 31 (NTR 31), తారక్ 32 (NTR 31) సినిమాలకు ఆయనే దర్శకుడు. ఒకవేళ కుదిరితే ఆ తర్వాత వెట్రిమారన్ సినిమా ఉండొచ్చు. అది కూడా ఎన్టీఆర్ స్టోరీకి ఓకే చెబితే! ఎన్టీఆర్ 32 గురించి మరో ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ మరో రెండో రోజుల్లో!
కన్నడ హీరో యశ్ హీరోగా తీసిన 'కెజిఎఫ్', 'కెజిఎఫ్ 2' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్... తెలుగోడే. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి, నటుడు ఆదర్శ్ బాలకృష్ణలకు ఆయన బంధువు కూడా! తెలుగు హీరోలలో ఎన్టీఆర్ అంటే అభిమానం కూడా!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేయనున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యేలోపు ప్రభాస్ 'సలార్' పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్ మీద ఉంది. ఆ సినిమా కూడా రెండు పార్టులుగా విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.
Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
ఎన్టీఆర్ 30వ సినిమా విషయానికి వస్తే... మార్చి ఆఖరి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొరటాల శివ రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతోంది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళితే... ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కూడా బ్రేక్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడాది కావస్తుండటంతో వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకుడు.
Also Read : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టు విప్పే పనిలో పోలీసులు