Dulquer Salmaan - Project K: ‘ప్రాజెక్ట్ K’లో దుల్కర్ సల్మాన్? మరో కీలక పాత్రలో సర్‌ప్రైజ్
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నారట. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ప్రాజెక్టు K’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితా బచ్చన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు సోషిస్తున్నారు.
‘ప్రాజెక్ట్ K’లో దుల్కర్ సల్మాన్ అతిథి పాత్ర!
తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో కూడా కనిపించబోతున్నారట. తను మరెవరో కాదు దుల్కర్ సల్మాన్. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ నటుడు, ఈ చిత్రం అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఇందులో తన పాత్ర డ్యురేషన్ తక్కువే అయినా, కథకు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఈ పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో కలిసి దుల్కర్ ‘మహానటి’ చిత్రంలో పని చేశారు. సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో నటించి మెప్పించారు.
భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ చిత్రం
ఇక ‘ప్రాజెక్టు K’ భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్టు K’తో పాటు ‘సలార్’, ‘రాజా డీలక్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జూన్ 16న విడుదలకు రెడీ అవుతోంది.
‘సీతారామం’తో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్
ఇక దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించారు. ఈ చిత్రంలోదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో కలిసి నటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా ప్రేక్షకులను అలరించింది. గతేడాది ఆగష్టు 5న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85 కోట్లు సాధించింది. తెలుగులో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుత నటన కనబర్చారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. ‘ది కార్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘సీతారామం’ ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించారు. నార్త్ టు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడి ప్రతిభను, హీరో, హీరోయిన్ల నటనను అభినందించారు. ఆర్మీ, విదేశీ రహస్యాలు, ప్రేమకథ కలగలుపుగా ‘సీతారామం’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ క్యారెక్ట్ చేశారు.
View this post on Instagram
Read Also: హీరో శింబుతో బ్రేకప్‌పై నోరు విప్పిన హన్సిక - ఆసక్తికర విషయాలు వెల్లడి