Darshan Cancel: అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ బెయిల్ రద్దు - వెంటనే జైలుకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశం
Actor Darshan: అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ మరోసారి జైలుకెళ్లనున్నారు. ఆయన బెయిల్ నుసుప్రీంకోర్టు రద్దు చేసింది.

Actor Darshan and Pavithra Gowda Bail Cancelled: కన్నడ సినీ స్టార్ దర్శన్ తూగుదీప , నటి పవిత్రా గౌడతో సహా ఆరుగురు నిందితులకు కర్ణాటక హైకోర్టు 2024 డిసెంబర్ 13న మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను సుప్రీంకోర్టు ఆగస్టు 14, 2025న రద్దు చేసింది. ఈ కేసు రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని హత్య కేసుకు సంబంధించినది. ఇందులో దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
రేణుకాస్వామి, దర్శన్ అభిమాని, 2024లో హత్యకు గురయ్యాడు. దర్శన్‌తో సంబంధం ఉన్న పవిత్రా గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ, ఇతర సహ నిందితులు అరెస్టయ్యారు. కర్ణాటక హైకోర్టు దర్శన్‌తో సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది, దీనిని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు బెంచ్, కర్ణాటక హైకోర్టు బెయిల్ ఆదేశాలలో లోపాలను గుర్తించింది. హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం కాదని, ఆధారాలను సరిగా పరిశీలించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. దర్శన్, పవిత్రా గౌడతో సహా ఏడుగురు నిందితులను మళ్లీ అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది.
గతంలో దర్శన్‌కు కస్టడీలో "ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్" ఇచ్చినట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కోర్టు, జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని సూచించింది. భవిష్యత్తులో నిందితులకు ఇలాంటి ప్రత్యేక హోదా ఇస్తే, జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. "చట్టం ముందు అందరూ సమానం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్శన్ సెలబ్రిటీ స్థాయి ఉన్నప్పటికీ, న్యాయ ప్రక్రియలో ప్రత్యేక హోదా ఇవ్వడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది.
#WATCH | Delhi | On SC cancelling actor Darshan's bail in the Renukaswamy murder case, Advocate Chandra Shekhar, representing Darshan in the case, says, "... The Supreme Court has said that no matter if someone is a popular actor, or has political power, they should be treated… pic.twitter.com/jT4NioN2N1
— ANI (@ANI) August 14, 2025
ఈ కేసు కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు, అయితే బాధితుడి కుటుంబం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో దర్శన్ అస్సాంలోని కామాక్య దేవి ఆలయాన్ని సందర్శించిన వీడియో వైరల్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్శన్ , ఇతర నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
#WATCH | Bengaluru: On SC cancelling actor Darshan's bail in the Renukaswamy murder case, Congress leader Sharath Bachegowda says, "The state government hasn't granted bail to Darshan, but the Karnataka High Court may have. The law will take its course. Whatever has happened is… pic.twitter.com/VBgcNYoOXH
— ANI (@ANI) August 14, 2025





















