Pavithra Gowda: బెయిల్‌పై బయటకొచ్చిన పవిత్ర గౌడ... దర్శన్ పేరు మీద ప్రత్యేక పూజలు - జనాల రియాక్షన్ ఏమిటంటే?
Pavithra Gowda Bail: రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ఇప్పటికే బెయిల్ పై బయట తిరుగుతుండగా, తాజాగా పవిత్ర గౌడకు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బయటకు రాగానే ఏం చేసిందంటే ?

కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని అయిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసింది. ఈ కేసులో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ కూడా అరెస్టు అయ్యింది. తాజాగా బెయిల్ పై వీరిద్దరూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పవిత్ర గౌడ బయటకు రాగానే చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది.
బెయిల్ మీద వచ్చీ రాగానే పవిత్ర చేసిన పని ఇదే
బెయిల్ పై విడుదల కాగానే పవిత్ర గౌడ చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా బెయిల్ మీద రిలీజ్ అయిన ఆమె బయటకు వచ్చి రాగానే... కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులతో కలిసి వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్ళింది. అక్కడ దర్శన్ పేరు మీద ఆమె ప్రత్యేక పూజలు చేయించడం విశేషం. దర్శన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పవిత్ర ఈ సందర్భంగా పేర్కొంది. గత కొన్ని నెలల నుంచి దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండగా, ఆయనకు ఆపరేషన్ జరగాల్సి ఉంది. త్వరలోనే వైద్యులు ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆపరేషన్ కోసమే దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చి, ఆ తర్వాత ఇతర కారణాలు చూపిస్తూ ఆపరేషన్ చేయించుకోకుండా బయట తిరుగుతున్నారు.
అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే?
దర్శన్, పవిత్ర గౌడల ప్రేమ వ్యవహారంపై రేణుకా స్వామి తీవ్రంగా కామెంట్స్ చేస్తున్న కారణంగా అతనిని హత్య చేయించారనే నిజం వెలుగులోకి వచ్చింది. చిత్ర దుర్గ షెడ్డుకు రేణుకా స్వామిని తీసుకు వచ్చి, ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి, హత్య చేశారని నిందితుల్లో ఒకరు పోలీసులకు తెలియజేశారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ లో రేణుక స్వామి తీవ్ర గాయాలు కావడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా కావడంతో మరణించినట్టు బయటపడింది. స్వయంగా దర్శన్ పక్కనే ఉండి రేణుకా స్వామిని హత్య చేయించాడని విచారణలో వెల్లడైంది. ఇక ఆ హత్య టైంలో పవిత్ర గౌడ సైతం అక్కడే ఉండడం, ఆమె వల్లే ఆ హత్య జరిగిందని పోలీసులు మీడియాకు తెలియజేయడంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేణుకా స్వామి హత్య కేసులో జూన్ 11న దర్శన్ అరెస్ట్ కాగా, అదే రోజు పవిత్రతో పాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో నేహా శెట్టి... బ్యాంకాక్‌లో షూటింగ్ - 'ఓజీ'లో రాధిక రోల్ ఏమిటంటే?
ఇక ఈ విషయం తెలిసాక ప్రతి ఒక్కరూ దర్శన్ తో పాటు పవిత్ర గౌడకు కఠినమైన శిక్షణ విధించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా, దాదాపుగా శిక్ష ఖాయం అనుకుంటున్న తరుణంలో దర్శన్ కు ఆరోగ్యపరమైన పరిస్థితుల కారణంగా రీసెంట్ గా బెయిల్ మంజూరు చేశారు. హత్యకు ప్రేరేపించి హత్యకు కుట్ర పన్నిన కేసులో దర్శన్, పవిత్ర గౌడలపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన దర్శన్ పవిత్రలకు శిక్ష పడుతుందా? లేదా ఎప్పటిలాగే వాళ్ళు యధేచ్చగా తిరుగుతారా? అనే చర్చ మొదలైంది.
Also Read: సౌత్ కంటే డబుల్... హిందీలో మొదటి సినిమా 'బేబీ జాన్' కోసం రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

