Prabhas: ప్రభాస్ వస్తున్నాడు కానీ ఫ్యాన్స్‌కి నో ఎంట్రీ!
ప్రభాస్ 'సీతారామం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్ తరువాత బయట పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా దర్శకుడు ఓం రౌత్ నిర్వహించిన ఓ పార్టీకి వెళ్లారాయన. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆయన 'సీతారామం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు. మొదట ప్రభాస్ ఈ ఈవెంట్ కి రావడంపై నిర్మాత అశ్వనీదత్ కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు కానీ ఫైనల్ గా ప్రభాస్ ఓకే చెప్పడంతో అఫీషియల్ గా వెల్లడించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కానీ అభిమానులందరికీ ప్రభాస్ ని చూసే ఛాన్స్ లేదట. ఈ వేడుకను ఎప్పుడూ ఈవెంట్స్ జరిగే పెద్ద ఆడిటోరియమ్స్ లో చేయడం లేదట. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో చిన్న ప్రాంగణంలో మీడియా, కొందరు సినీ ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీనికి సాధారణ అభిమానులను అనుమతించడం లేదట.
ఎంపిక చేసిన కొందరు ఫ్యాన్స్ మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొంటారట. రీసెంట్ గా 'బింబిసార' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకున్న సంఘటన కారణంగానే 'సీతారామం' నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'బింబిసార' ఈవెంట్ లో ఓ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతడి మరణానికి గల కారణాలేంటనే విషయంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సినిమా వేడుకల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే పోలీసులు ఈవెంట్ పర్మిషన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 'సీతారామం' ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ అంటే.. అతడిని చూడడానికి జనాలు ఎగబడతారు. అందుకే చాలా తక్కువ మంది అభిమానులతో ఈవెంట్ ను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram