7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!
7:11Pm’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై కొంత ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పాలి.
7:11 PM Movie: సినిమాల విషయంలో ప్రేక్షకుల తీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. భారీ బడ్జెట్ చిత్రాలైనా, చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఆ దిశగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వస్తోన్న యంగ్ డైరెక్టర్స్ అందులో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాంటి ఒక కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రాబోతోంది. అదే.. ‘7:11Pm’ సినిమా. ఈ సినిమాకు చైతు మాదాల దర్శకత్వం వహించారు. సాహస్, దీపిక హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాను. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఆసక్తిరేకెత్తించే స్క్రీన్ తో నడిచే ఈ సినిమా టైమ్ ట్రావెల్, ఇంటర్ స్టెల్లార్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
ఉత్కంఠభరితంగా ‘7:11Pm’ మూవీ టీజర్..
ఈ ‘7:11Pm’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై కొంత ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పాలి. టీజర్ విషయానికొస్తే..టీజర్ చూస్తుంటే ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. టీజర్ లో మూవీలోని ప్రధాన పాత్రలను అలాగే సినిమాలోని మెయిన్ లీడ్ పాయింట్లను పరిచయం చేశారు. ఇది 1999 లో హంసలదీవి అనే ఒక పట్టణం చుట్టూ సాగే టైమ్ ట్రావెల్ కథలా కనిపిస్తోంది. 1999లో ఒక ముఖ్యమైన రోజున, భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం “హంసలదీవి” అనే చిన్న పట్టణానికి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్ ని నాశనం చేయడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక పట్టణం, రెండు గ్రహాలు, మూడు టైమ్ పిరీడ్ లు ఇలా సినిమాలోని ప్రతీ అంశం ఆసక్తికరంగా ఉంటుంది. చివరిలో సినిమాలో హీరో తన చేతికున్న టైమ్ ను 7:11pm చేరుకునే సరికి డియాక్టివేట్ చేయాలి లేకుంటే చనిపోతాడు అని చెప్తారు. అసలు అతను తన చేతికి టైమ్ ఎందుకు సెట్ చేసుకున్నాడు, ఆ పట్టణాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు, హీరో ఆ పట్టణాన్ని ఎలా కాపాడాడు వంటి అంశాలన్నీ వెండితెరపై చూడాల్సిందే.
మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది..
కొత్తదనాన్ని ప్రోత్సాహించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి. అందుకే కొత్త దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మన హీరోలు కూడా యంగ్ జనరేషన్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దర్శకుడు చైతూ మాదాలా తన మొదటి సినిమానే ఒక సంక్లిష్టమైన కథను ఎంచుకుని ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి. తెలుగులో టైమ్ ట్రావెల్ సినిమాలు ఇప్పటికే చాలానే వచ్చాయి. అప్పుడెప్పుడో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ నుంచి మొన్న శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ వరకూ ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ‘7:11pm’ టైమ్ ట్రావెల్ సినిమాలో దర్శకుడు ఎలాంటి కథను ఎంచుకున్నాడు, ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడు అనేది సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది.