Allari Naresh: 20 ఇయర్స్ ఇండస్ట్రీ - అల్లరి నరేష్ స్పెషల్ థాంక్స్
నరేష్.. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు అల్లరి నరేష్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ రేంజ్ లో కామెడీ పండించింది అల్లరి నరేష్ అనే చెప్పాలి. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన మొదటి సినిమా 'అల్లరి'ని ఇంటి పేరుగా చేసుకున్నారు నరేష్. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్న నరేష్.. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది.
ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు అల్లరి నరేష్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన నరేష్ ఓ థాంక్యూ నోట్ ను రిలీజ్ చేశారు. తనతో కలిసి పని చేసిన కో ఆర్టిస్ట్ లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, స్టాఫ్ అండ్ క్రూ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ దేంతో మ్యాచ్ చేయలేనని.. ఫ్యాన్స్ చూపించిన ఎనలేని ప్రేమకు.. ఫ్యామిలీ సపోర్ట్ కి థాంక్స్ చెప్పారు. ఈ ఇరవై ఏళ్లలో 59 సినిమాలు చేసినట్లు తన స్కోర్ కార్డుని షేర్ చేశారు.
ఒకప్పుడు కామెడీ హీరోగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు ఆ తరహా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన కంఫర్ట్ జోనర్ ను పక్కన పెట్టి సీరియస్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. 'మహర్షి', 'నాంది' లాంటి సినిమాలు అల్లరి నరేష్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఇతడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాలో నటిస్తున్నారు.
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
View this post on Instagram