Zahirabad Election Results 2024: జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు, వెనకబడ్డ బీజేపీ - బీఆర్ఎస్ మూడో స్థానంలో!
Zahirabad Lok Sabha Election Results 2024: జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ సురేశ్ కుమార్ షెట్కార్ భారీ మెజారిటీతో గెలిచారు.
Zahirabad Lok Sabha Elections 2024: జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ ఘన విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై 46188 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. సురేష్ కుమార్ షెట్కార్ కు 528418 ఓట్లు పోలయ్యాయి. బీబీ పాటిల్ కు 482230 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ కు 172078 ఓట్లు మాత్రం వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ ముందంజలో మొదటి నుంచి దూసుకుపోయారు. ఉదయం 10.30 గంటల సమయానికి ఈయనకు 330138 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 16228 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ గాలి 213896 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం లేదు. పైగా ప్రతి చోటా మూడో స్థానంలో ఉంటోంది.