UP Elections 2022: ఆ నగర మేయర్‌పై ఎఫ్ఐఆర్- ఓటు వేసేటప్పుడు ఫొటో తీస్తే అంతేగా!
యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ కాన్పుర్ మేయర్ ప్రమీళ పాండేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతుండగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. కాన్పుర్ మేయర్, భాజపా నేత ప్రమీళ పాండేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకంటే ఓటింగ్ చేస్తోన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏం జరిగింది?
కాన్పుర్ మేయర్ ప్రమీళ పాండే.. హుడ్సన్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లారు. అయితే తాను ఓటు వేసే సమయంలో ఫొటో మాత్రమే కాకుండా వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది పోలింగ్ సీక్రెసీ నియమాన్ని ఉల్లంఘించినట్లేనని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని కాన్పుర్ జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మ వెల్లడించారు.
ప్రమీళ పాండే మాత్రమే కాదు మరో భాజపా నేత నవాబ్ సింగ్‌పై కూడా ఇలాంటి ఫిర్యాదు నమోదైంది. నవాబ్ సింగ్.. భాజపా యువ మోర్చా మాజీ అధ్యక్షుడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 విడతల్లో యూపీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడత పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: Viral Video: గుడ్డు మీద గుడ్డు నిలబెట్టిన మొనగాడు, మీరు ఇలా చేయగలరా, వీడియో చూడండి
Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి