Thota TSrimurtulu Ticket Dilemma : తోట త్రిమూర్తులు టిక్కెట్ ఉంటుందా? మారుస్తారా?
Andhra Politics : తోట త్రిమూర్తులు టిక్కెట్ డైలమా కొనసాగుతోంది. మార్చాలా వద్దా అన్న అంశంపై జగన్ చర్చలు జరుపుతున్నారు.
![Thota TSrimurtulu Ticket Dilemma : తోట త్రిమూర్తులు టిక్కెట్ ఉంటుందా? మారుస్తారా? Thota Trimurtulu ticket dilemma Jagan discussing whether to change it or not Thota TSrimurtulu Ticket Dilemma : తోట త్రిమూర్తులు టిక్కెట్ ఉంటుందా? మారుస్తారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/4b8b5ac58588120482e0591c0b492c9e1713358082901228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan discuss: సరిగ్గా నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యే సమయానికి వైసీపీకి అనేక సమస్యలు చుట్టు ముడుతున్నాయి. అందులో ఒకటి మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అంశం. దళితుల శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులను దోషిగా న్యాయస్థానం తేల్చింది. శిక్ష కూడా విధించింది. అయితే ఆయన జైలుకు వెళ్లకుండా తాత్కలికంగా బెయిల్ లభించింది. శిక్షపై స్టే మాత్రం లభించలేదు. హైకోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉంది. సున్నితమైన దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడటంతో ఆయనను అభ్యర్థిగా కొనసాగించాలా వద్ద అన్న అంశంపై వైసీపీ అధినేత చర్చిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు చాన్సిస్తారా?
తోట త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని మార్చి అక్కడ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను నిలబెడితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఒక వేళ తోట త్రిమూర్తుల్ని కంటిన్యూ చేయిస్తే దళిత ఓట్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారట. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. తోటను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని దళిత సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల
దళితుల ఓట్లనే టార్గెట్ చేశారు. వైసీపీకి చెందిన పలువురు దళిత నేతల్ని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు.
టిక్కెట్ కొనసాగిస్తే దళితులు దూరమయ్యే అవకాశం
వైఎస్ఆర్‌సీపికి దళితులు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన అనేక పరిణామాలు దళితుల్ని దూరం చేశాయన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో శిరోముండనం కేసులో దోషి తేలిన వ్యక్తినీ సమర్థిస్తూ టిక్కెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దళితుడైన తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీలో ప్రాధాన్యం లభిస్తోంది. సస్పెండ్ చేసినట్లుగా ప్రకటన చేశారు కానీ.. ఆయన పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రంపచోడవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు తీసుకున్నారు.
మార్చబోరని తోట త్రిమూర్తులు ధీమా
ఆయనకు ప్రాధాన్యంపై ఇప్పటికే దళితుల్లో అసంతృరప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తోట త్రిమూర్తుల్ని కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంని చెబుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సారి టిక్కెట్ ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గరని.. అభ్యర్థి మార్చరని.. తోట త్రిమూర్తులు వర్గం నమ్మకంతో ఉంది. తామే పోటీ చేస్తున్నామని త్రిమూర్తులు కుమారుడు సోషల్ మీడియాలో ప్రకటించారు.
మండపేట అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం ఏమనగా శిరోమండనం కేసు లో నాన్న గారికి బెయిల్ వచ్చింది
— Thota Pruthvi Raj (@ThotaPruthviRaj) April 16, 2024
రానున్న 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి నాన్న గారే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు
ఏ విధమైన తప్పుడు ప్రచారాలు వదంతులు నమ్మవద్దు pic.twitter.com/xqF4yNQkZ5
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)