అన్వేషించండి

Chandrababu: 'సైకో పాలన పోయి కూటమి పాలన రావాలి' - ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకూ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న చంద్రబాబు

Andhrapradesh News: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు కూటమి మేనిఫెస్టోను వివరించారు.

Chandrababu Comments In Denduluru Prajagalam: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి.. కూటమి పాలన రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు (Eluru) జిల్లా దెందులూరులో (Denduluru) మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని.. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ ఇస్తామని, ఆశ వర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మరిన్ని హామీలను చంద్రబాబు ప్రస్తావించారు.

'రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు'

'మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ మెంట్ ఇస్తాం. పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తాం. గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. 'గోపాలమిత్ర' పునర్నియామకం దిశగా చర్యలు చేపడతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజమ్ లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. అలాగే, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'9 గంటల ఉచిత విద్యుత్'

అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 'కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయిస్తాం. కాపు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. అమరావతిలో 5 ఎకరాల్లో అల్లూరి స్మృతివనం ఏర్పాటు చేస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రకులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. పేదల గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులను నియమిస్తాం.' అని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కాంక్షించే మేనిఫెస్టోను రూపొందించామని.. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: Nara Bramhani : మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం - మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Swati Sachdeva: రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి  కుళ్లు జోకులు
రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి కుళ్లు జోకులు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
Embed widget