అన్వేషించండి

Supreme Court: ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి బిగ్ షాక్ - పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

AndhraPradesh News: వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Supreme Court Rejects Ysrcp Postal Ballot Petition: ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా, పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించి 'ఫాం - 13ఏ'పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీల్) లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వైసీపీ (Ysrcp) ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం వైసీపీ వాదనలను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉందన్న ఎన్నికల సంఘం ఆదేశాలను సమర్థించింది. పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది.

సుప్రీంలో సవాల్

అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆదివారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అటు, ఇదే అంశంపై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు న్యాయస్థానం తన వాదనలు సైతం వినాలని పిటిషన్ ఫైల్ చేశారు. 

Also Read: Supreme Court: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ - కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Embed widget