అన్వేషించండి

AP Congress : ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీల అమలు - సోమవారం అభ్యర్థుల ప్రకటన !

Telangana News : ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలు అమలు చేస్తామని షర్మిల ప్రకటించారు. అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

AP Congress 9 guarantees :  గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ప్రారంభించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.  9 గ్యారెంటీ ల కరపత్రం,డోర్ స్టిక్కర్ ను ఈ సందర్బంగా షర్మిల ఆవిష్కరించారు.  

సోమవారం అభ్యర్థుల ప్రకటన 

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని.. ఇందులో B ఫామ్ లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయని షర్మిల తెలిపారు.  హైకమాండ్ తో చర్చించేందుకు ఆదివారం షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం ఏపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.  టిక్కెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించక పోతే చరిత్ర మనలను క్షమించదని..  ధరకాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి,రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నామన్నారు. అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నాం .. ఇది కాంగ్రెస్ పార్టీ.రీజినల్ పార్టీ కాదు ..ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొనే పార్టీ కాదని గుర్తు చేశారు. 

ప్రజాస్వామ్యబద్దంగా అభ్యర్థుల ఎంపిక

ప్రజాస్వామ్య బద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని షర్మిల తెలిపారు. టిక్కెట్ రాని వాళ్ళు అభ్యర్థి కోసం కాదు...పార్టీ కోసం,ప్రజల కోసం,దేశం కోసం పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలి ..కాంగ్రెస్ అధికారంలో లేకుంటే ఎలా ఉందో చూస్తున్నామన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం.ఇదే మన బలమని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయక పోతే చరిత్ర హీనులుగా మిగులుతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడదాం మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందామని పిలుపునిచ్చారు.  

 టీడీపీ,వైసీపీ రెండు బీజేపీ తోత్తులే

బీజేపీ మేలు చేయక పోయినా బాబు,జగన్ లు బానిసలు గా మారారని షర్మిల విమర్శించారు.  హోదా 10 ఏళ్లు రావాలి
ఇవ్వాళ్టి వరకు హోదా ఊసే లేదు.. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు..అయినా బాబు,జగన్ ఇద్దరు దొందు దొందే అన్నారు. చంద్రబాబు బీజేపీ తో 2014 లో పొత్తు పెట్టుకొని విడాకులు తీసుకున్నారు.. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారన్నారు.  జగన్ ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోడీకి దత్తపుత్రుడు అన్నారని ప్రశ్నించారు. ఒకరిది బహిరంగ పొత్తు..మరొకరిది రహస్య పొత్తు.. ఒకరిది సక్రమైన పొత్తు.మరొకరిది అక్రమ పొత్తు.. ఇలాంటి మోసాలను మనం గడప గడపకి చేర్చాలని పిలుపునిచ్చారు.  బాబు కి,జగన్ ఓటేస్తే బీజేపీ కే ఓటు అని అర్థం అయ్యేలా చెప్పాలన్నారు.  ఇవ్వాళ హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాత్రమే హోదా పై కట్టుబడి ఉందన్నారు.  

కాంగ్రెస్ 9 గ్యారంటీలు ఇవే :  

 
మొదటి గ్యారెంటీ

రాష్టానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా

కాంగ్రెస్ అధికారంలో వస్తె రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా గ్యారెంటీ
అధికారంలో వచ్చిన వెంటనే హోదా అమలు

రెండో గ్యారెంటీ

మహిళా మహాలక్ష్మి

ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8500 ఇస్తాం
ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తాం
ఇది మహిళకు బరోసా ఇచ్చే పథకం

మూడో గ్యారెంటీ

రైతులకు రుణమాఫీ

రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ

నాలుగవ గ్యారెంటీ

పెట్టుబడి మీద 50 శాతం లాభం తో కొత్త మద్దతు ధర

5 వ గ్యారెంటీ

ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం 400రూపాయలు

6వ గ్యారెంటీ

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

7 వ గ్యారెంటీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ

మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే


8 వ గ్యారెంటీ

ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు

9 వ గ్యారెంటీ

ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్

అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పెన్షన్

వికలాంగులకు 6 వేల పెన్షన్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Embed widget