అన్వేషించండి

Amit Shah Rally: 'దిల్లీని మందులో ముంచేసిన కేజ్రీ- పంజాబ్‌ను డ్రగ్స్ రహితం చేస్తారట'

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలులుగంటున్నారని లుధియానాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు.

" భారత ప్రధాని పర్యటనకు సురక్షితమైన రూట్‌ను ఇవ్వలేని సీఎం.. పంజాబ్ మొత్తాన్ని భద్రంగా చూసుకోగలరా? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చన్నీ కలలుగంటున్నారు.                                                 "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

కేజ్రీవాల్‌పై

ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. పంజాబ్ భద్రతను చూసుకునే సత్తా కేజ్రీవాల్‌కు లేదన్నారు.

" భద్రతాపరమైన విషయాల గురించి కేజ్రీవాల్‌కు ఏం తెలీదు. కేజ్రీవాల్‌కు పంజాబ్‌లో అధికారమిస్తే తీవ్రవాదులకు స్వేచ్ఛ దొరికినట్లే. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ మాత్రమే పంజాబ్‌ను కాపాడగలదు.                                                               "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

డ్రగ్స్ రహితంగా

పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి భాజపా కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు.

" ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మేం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం. 2020, 2021లో మేం పట్టుకున్న డ్రగ్స్.. పదేళ్లలో కూడా ఎవరూ పట్టుకోలేదు. మేం అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని నాలుగు నగరాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలోనూ ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేస్తాం. మరోవైపు దిల్లీని మందులో ముంచేసిన కేజ్రీవాల్.. ఇక్కడకు వచ్చి పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామంటున్నారు. వాళ్లు ఇది చేయగలరా?                                                               "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా.. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్‌ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా పార్టీ శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.

Also Read: Kerala Bus Owner: కరోనా దెబ్బకు విలవిల, బస్సులను కిలో రూ.45కు విక్రయించిన ఓనర్

Also Read: Madhya Pradesh: సొరంగం కూలిన ఘటనలో ఏడుగురు సురక్షితం- మరో ఇద్దరి కోసం ఆపరేషన్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget