Madhya Pradesh: సొరంగం కూలిన ఘటనలో ఏడుగురు సురక్షితం- మరో ఇద్దరి కోసం ఆపరేషన్
మధ్యప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ఏడుగురిని సురక్షితంగా కాపాడాయి సహాయక బృందాలు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కట్ని జిల్లాలోని స్లిమ్నాబాద్లో నిర్మాణంలో ఉన్న బార్గీ కెనాల్ ప్రాజెక్ట్ సొరంగం కూలింది. శిథిలాల కింద 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో ఏడుగురిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఎస్డీఈఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలను వేగవంతం చేశాయి.
कटनी जिले के स्लीमनाबाद में नहर के निर्माण कार्य के दौरान श्रमिकों के दबने के समाचार से दु:ख हुआ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 12, 2022
यह राहत की बात है कि 9 में से 3 श्रमिकों को सकुशल बाहर निकाल लिया गया है। राहत और बचाव कार्य जारी है। https://t.co/ICfmjW2zU0
సీఎం
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. కట్ని కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీఎం. బాధితులకు అవసరం అయిన చికిత్సను అందించాలని సూచించారు.
ప్రమాదం ఇలా
భూగర్భ సొరంగం నిర్మాణ పనులు చేస్తోన్న సమయంలో 70 అడుగుల లోతుకు కూలీలు తవ్వారు. ఈ క్రమంలో మట్టి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తు స్పందన దళం.. ఆపరేషన్ వేగవంతం చేసింది. దీంతో ఏడుగురు కూలీలను ప్రాణాలతో కాపడగలిగారు. మరో ఇద్దరికి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: Talking on Phone While Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవచ్చు, ఏ చలానాలు విధించరు !
Also Read: PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపం, అంబులైన్స్ లో వైద్యులు మిస్సింగ్!