Assembly Election Results 2024 Live: మహారాష్ట్రంలో బులెట్ ట్రైన్ స్పీడ్‌తో ఎన్డీఏ- జార్ఖండ్‌లో ఎక్స్‌ప్రెస్ వేగంతో ఉన్న జేఎంఎం కూటమి
Assembly Election Results 2024 Live: 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో మెజారిటీకి 145 సీట్లు కావాలి. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో 42 సీట్లు వచ్చిన వాళ్లదే అధికార పీఠం.
LIVE
Background
Maharashtra And Jharkhand Assembly Election 2024 Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ (నవంబర్ 23) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వస్తున్నాయి.
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు విడుదల చేశాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా జార్ఖండ్‌లో హంగ్ ప్రభుత్వం, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ లేకపోలేదని కూడా చెప్పుకొచ్చాయి.
2019 ఫలితాలు ఎలా ఉన్నాయి?
288 సీట్లు ఉన్నా మహారాష్ట్రలో 145 సీట్లు వచ్చిన వాళ్లు అధికారంలోకి వస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 105 సీట్లలో విజయంసాధించింది. శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత శివసేన, ఎన్సీపీ రెండు వర్గాలుగా విడిపోయాయి. 2019లో రాష్ట్రంలో శివసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాయి. శివసేన-బీజేపీ కూటమికి జనం జై కొట్టారు. సీఎం పదవి విషయంలో లెక్కలు తేడా వచ్చి కూటమి విడిపోవాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం రెండున్నరేళ్లు మాత్రమే కొనసాగింది. శివసేనలో సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. షిండే-బిజెపి ప్రభుత్వంతో అజిత్ పవార్ శిబిరం చేతులు కలిపింది.
జార్ఖండ్ విషయానికి వస్తే 2019 నవంబర్ 30న ఎన్నికల నిర్వహించారు. ఫలితాలు డిసెంబర్ 20న ప్రకటించారు. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో 42 సీట్లు వచ్చిన వాళ్లే ప్రభుత్వంలో కూర్చుంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి విజయం సాధించింది. అప్పుడు జేఎంఎం 30 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 25, కాంగ్రెస్‌కు 16 సీట్లు గెలుచుకున్నాయి.
జార్ఖండ్‌లో ఏ పార్టీ ఏ కూటమిలో ఉంది?
జార్ఖండ్‌లో ఎన్‌డీఏలో బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, ఎల్‌జేపీ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండీ కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో ఏ పార్టీ ఏ కూటమిలో ఉంది?
మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. విపక్ష కూటమి ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను, శివసేన 95 మంది, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) 86 మంది అభ్యర్థులను బరిలో దింపారు. రాజ్ ఠాక్రే MNS, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), SP, AIMIM సహా చిన్న పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ 237 మందిని, ఏఐఎంఐఎం 17 మందిని నిలబెట్టాయి.
మహారాష్ట్రలో పోటీలో ఉన్న వీఐపీ అభ్యర్థులు
మహారాష్ట్ర నుంచి VIP అభ్యర్థులు
1. ఏకనాథ్ షిండే - కోప్రి-పచ్పఖాడి పార్టీ నుంచి పోటీ- శివసేన (షిండే), ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు (షిండే) వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, కోప్రి-పచ్‌పఖాడి నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. కేదార్ దిఘేతో పోటీ
2. దేవేంద్ర ఫడ్నవిస్- నాగ్‌పూర్ సౌత్ వెస్ట్- బీజేపీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి, 2014-2019 మధ్య మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల గుధేతో పోటీ
3. అజిత్ పవార్- బారామతి NCP (అజిత్). మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి, NCP అధ్యక్షుడు (అజిత్). గతేడాది మేనమామ శరద్ పవార్‌తో విడిపోయారు. 1995 నుంచి వరుసగా 6 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
Election Results 2024 Live: మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ, జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ముందంజ
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో బీజేపీ కూటమి 209 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండీ కూటమి 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి మెజారిటీ మార్కును అధిగమించింది. బీజేపీ కూటమి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేఎంఎం కూటమి 50కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో సెంచరీలు కొట్టిన ఇరు కూటములు
Maharashtra Assembly Elections: తొలి ట్రెండ్స్‌లో మహారాష్ట్రలో ఎన్డీయే 127 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో మెజార్టీకి దగ్గర్లో JMM కూటమి
Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో గట్టి పోటీ కనిపిస్తుంది. బీజేపీ కూటమి, జేఎంఎం కూటమి మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. జేఎంఎం కూటమి 38 స్థానాల్లో, బీజేపీ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Wayanad By Election Result 2024: వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఆధిక్యం
Wayanad By Election Result 2024: రాహుల్ గాంధీ రాజీనామాతో వచ్చిన వయనాడ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్యదాస్ వెనుకబడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. రాయబరేలీ, వయనాడ్‌లో పోటీ చేశారు. రెండు స్థానాల్లో గెలవడంతో వయనాడ్‌కు రాజీనామా చేశారు. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీచేసిన ప్రియాంక విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
Assembly Election Results 2024 Live: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్డీయే ముందంజ
Maharashtra Assembly Elections: తొలి ట్రెండ్స్‌లో మహారాష్ట్రలో ఎన్డీయే 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Jharkhand Assembly Elections: జార్ఖండ్‌లో గట్టి పోటీ కనిపిస్తుంది. బీజేపీ కూటమి, ఇండీ కూటమి మధ్య ఆధిక్యం ఊగిసలాడుతోంది. ఇప్పుడు బీజేపీ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేఎంఎం కూటమి 29 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.