Harish Kumar Gupta ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు - ఘనస్వాగతం పలికిన అధికారులు
Andhrapradesh News: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీస్ అధికారులు గౌరవ వందనం సమర్పించి ఘన స్వాగతం పలికారు.
Harish Kumar Gupta Takes Charge As AP New DGP: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తక్షణం విధుల్లో చేరాలన్న ఈసీ (Election Commission) ఆదేశాలతో మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన పోలీస్ బాస్ గా విధుల్లో చేరారు. అంతకు ముందు ఆయనకు పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.
కాగా, ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో విచారించిన ఎన్నికల సంఘం ఆదివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ ఆదేశాలతో కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను కొత్త పోలీస్ బాస్ పోస్ట్ కోసం సిఫార్సు చేసింది. వీరిలో 1992వ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఈసీ.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా, హరీష్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.
Also Read: PM Modi: వైసీపీ సర్కార్‌లో అవినీతి ఫుల్ స్పీడ్, అభివృద్ధికి బ్రేక్ - వీరికి అది చేత కాదు: మోదీ