అన్వేషించండి

Karnataka Election 2023 : పార్టీ పెట్టిన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి - ఆయన పార్టీ పరిస్థితేమిటో తెలుసా ?

పార్టీ పెట్టిన ఆరు నెలల్లో గాలి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మిగతా అందరు అభ్యర్థులు ఓడిపోయారు.

Karnataka Election 2023 :   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి. దిగ్గజ నేతలు కొంత మంది పరాజయం పాలయ్యారు. చాలా కాలం నుంచి టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి ఈ సారి బీజేపీని తీవ్రంగా దెబ్బకొట్టారు. ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. బీజేపీ అభ్యర్థుల్ని ఓడించారు. 

కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా పని చేసేవారు. అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది.  గత డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. గంగావ‌తిలో బీజేపీ మూడ‌వ స్థానంలో నిలిచింది.                              
 
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎంతో సీనియర్ నాయకులు పోటీలో ఉన్నా గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి  విజయం సాధించారు.  సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన మద్దతు కాంగ్రెస్ కు అవసరం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ తరపున అనేక నియోజక వర్గాల్లో చాలా మంది పోటీ చేశారు.  బళ్లారిలో పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి  భార్య లక్ష్మీ అరుణ ఓడిపోయారు. అయితే గట్టి పోటీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు అందర్ని గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచి తాను పని చేస్తానని గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.                                            

తాను బెంగళూరులోని విధాన సౌధలో త్వరలోనే అడుగుపెడుతానని, తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని, ఏదో ఒకపార్టీకి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ప్రజలకే మంచిది అని గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.  తాను బీజేపీ అనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ఆ ఇంటికి తనకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ నాయకులకు దురంహకారం ఎక్కువ అయ్యిందని, అందుకే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎదురైయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అందరి ఉసురు తగిలి బీజేపీకి ఇలాంటి గతిపట్టిందని గాలి జనార్దన్ రెడ్డి శాపాలు పెడుతున్నారు.          

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget