అన్వేషించండి

CPIని జాతీయ హోదా నుంచి తప్పించడం అవివేకం: కూనంనేని

ఈసీ నిర్ణయంపై త్వరలో సవాల్ చేస్తాందేశ స్వాతంత్య్రంలో, అనంతరం కీలక మలుపులో సిపిఐది కీలక పాత్ర

దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి  ఎన్నికల కమిషన్ జాతీయ హోదాను ఉపసంహరించడం అవివేక చర్య అన్నారు CPI  రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.  ఈ సమయంలో ఉపసంహరించడం అనేక అనుమానాలకు తావిస్తోందని, జాతీయ హోదాకు గుర్తింపు సంబంధించిన నిబంధనలే తప్పుగా ఉన్నాయని విమర్శించారు. ఈసీ నిర్ణయంపై త్వరలో సవాల్ చేస్తామని తెలిపారు. కేవలం ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం సరైంది కాదని కూనంనేని అభిప్రాయపడ్డారు. మన దగ్గర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం ఉందని అన్నారు.

ప్రతి ఎన్నికలో అన్ని పార్టీలు, అన్ని స్థానాల్లో పోటీ చేయలేవని తెలిపారు. ఎన్నికల అవగాహనలు, సర్దుబాట్లు ఉంటాయన్నారు.  వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు విధానంలో జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ నిర్దారించడం సరైనది కాదన్నారు కూనంనేని. ఎన్నికలు డబ్బులు, ప్రలోభాలమయం అయిపోయాయని, వీటిని అరికట్టలేక ఎన్నికల కమిషన్, ప్రతి ఎన్నికల్లో తన అసమర్థతను చాటుకుంటోందన్నారు.  ప్రతి అభ్యర్థికి పోటీలో సమాన అవకాశాలు కల్పించలేకపోతున్నదని విమర్శించారు. పైగా గత ఎన్నికల్లో ప్రధాని కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకోలేకపోయిందని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూలు విడుదలను అధికార పార్టీకి అనుకూలంగా ఆలస్యం చేసిందన్నారు.

జాతీహోదాపై నిర్ణయించే నైతికత ఈసీకి లేదు

ఇలాంటి వివక్షాపూరితమైన ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు  సంబంధించిన  హోదాపై నిర్ణయించే నైతికత లేదని మండిపడ్డారు కూనంనేని. ప్రస్తుతం మన దేశంలో అవలంభిస్తున్న ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎన్నికల విధానమే సరైంది కాదనే చర్చ సాగుతోందని అభిప్రాయపడ్డారు. బహుముఖ పోటీలో 20, 30 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థులు కూడా గెలుస్తున్నారని, కనీసం 50 శాతం ఓట్లు దాటని విజేతకు జనామోదం లేదని భావిస్తామా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానాన్ని రద్దు చేసి, దామాషా పద్ధతిలో నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ పార్టీల వాస్తవ బలం బైటపడుతుందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్రోద్యమం, అనంతరం ప్రతి కీలక మలుపుతో  ముడిపడి ఉన్న సీపీఐ చరిత్ర, అన్ని రాష్ట్రాల్లో ఉన్న సభ్యత్వాలు, అనుబంధ ప్రజాసంఘాల సభ్యుల సంఖ్యను పరిగణలో తీసుకోకుండా కేవలం సాంకేతిక అంశాలతో జాతీయ హోదాను తొలగించడం ఎన్నికల కమిషన్ అవివేక చర్య అన్నారు.

CPI కంకి కొడవలికి వచ్చిన ముప్పేమీ లేదు

సీపీఐ జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ ఉపసంహరించినంత మాత్రాన పార్టీ ఎన్నికల గుర్తు కంకి కొడవలి గుర్తు పోదని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కంకి కొడవలి సీపీఐకే ఉంటుందని, ఇతర పార్టీలకు ఇవ్వబోరని, దేశ వ్యాప్తంగా కిందిస్థాయి వార్డు మెంబర్ నుంచి MP వరకు ఇలా ఏ ఎన్నికలోనైనా  CPI బీ ఫామ్  పోటీచేసే అభ్యర్థికి కచ్చితంగా కంకి కొడవలి గుర్తును ఇకముందు కూడా ఎన్నికల కమిషన్ కేటాయిస్తుందని తెలిపారు. జాతీయహోదా అనేది సాంకేతిక అంశం మాత్రమేనని, దీనివల్ల దూరదర్శన్, రేడియోల్లో ప్రచారానికి కేటాయించే సమయంలో తేడా వస్తుంది తప్ప, ఇతర ఎలాంటి నష్టం ఉంబోదని వివరించారు. త్వరలోనే సాంకేతిక అంశాన్ని కూడా అధిగమనిస్తామని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా, అన్ని అంశాలను పరిగణలో తీసుకొని జాతీయహోదాను కొనసాగించిన విషయాన్ని కూనంనేని గుర్తు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget