Anantapur Urban : అనంతపురం అర్బన్‌లో కలసిపోయిన టీడీపీ నేతలు - దారిలో పడినట్లేనా ?
Andhra News : అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి సద్దుమణిగింది. ప్రభాకర్ చౌదరి .. టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికేందుకు నిర్ణయించుకున్నారు.
Anantapur Urban TDP : నిన్న మొన్నటి వరకు ఆ నేత ఆగ్రహంతో ఊగిపోయిన అనంతపురం అర్బన్ టీడీపీ ఇంచార్జ్ ప్రభాకర్ చౌదరి నెమ్మదించారు. పార్టీ క్యాడర్ సైతం ఈ సారి మా నాయకుడికి కాదని వేరొకరికి టికెట్ ఎలా ఇచ్చారు కచ్చితంగా మేము పార్టీ ని ఓడిస్తాం అని చాలెంజ్ చేశారు. పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు కూడా చేస్తాం అని హెచ్చరించారు. కట్ చేస్తే పది రోజుల్లో సీను మొత్తం మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నేత అధినాయకుడు చంద్రబాబుతో చర్చల అనంతరం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని వస్తా అంటూ కూడా హామీ ఇచ్చారు.
అనంతపురం అర్బన్‌లో కలిసిపోయిన టీడీపీ నేతలలు
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది అలాంటి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని మరో వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు అధినాయకత్వం టికెట్ కేటాయించడంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ ఆఫీస్ ను కూడా తగలబెట్టారు. పార్టీకి ముకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వర ప్రసాద్ ఎవరు అంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ కోసం కష్టపడిన మానేతను కాదని కొత్త వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారు ఆగ్రహంతో ఊగిపోయారు. సీన్ కట్ చేస్తే ప్రభాకర్ చౌదరితో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, పార్టీ పరిశీలకుడు నాని చర్చలు ఫలించకపోవడంతో ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలగచేసుకుని వైకుంఠం ప్రభాకర్ చౌదరికి సర్ది చెప్పాడు.. అధినేత మాట కాదనలేక మీరు చెప్పినట్లు నడుచుకుంటానంటూ అనంతపురం అర్బన్ లో వెంకటేశ్వర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని హామీ కూడా ఇచ్చాడు.. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో నిప్పుగా ఉన్న క్యాడర్ ఒక్కటైపోయారు.
అభ్యర్థితో సమావేశం అయిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అది నేత చంద్రబాబు పార్టీ నేతల చర్చల అనంతరం అనంతపురం తిరిగి వచ్చిన వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చౌదరి నివాసంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాజీ కార్పొరేటర్లు వివిధ రకాల పోస్టుల్లో ఉన్న నేతలందరూ తోను విడివిడిగా సమావేశం అయి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
టీడీపీ జాతీయ కార్యదర్శి గా వైకుంఠం ప్రభాకర్ చౌదరి
పార్టీలో ఏ పదవి లేకుండా పనిచేయటం ఎలా అంటూ కూడా కొందరు నేతలు బాహటంగానే చెప్పడంతో రాష్ట్ర పార్టీ పరిశీలకుడు నాని.. ఎమ్మెల్సీ రాంగోపాల్ ఇతర నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా హోదా కల్పించారు. దీంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ కుమారుడు జకిఉల్లా అలక !
మాజీ ఎంపీ సైపుల్లా కుమారుడు కేఎం జకీ ఉల్లా కూడా అనంతపురం అర్బన్ లో మంచి పేరున్న నాయకుడు. 1983 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని కాదని ప్రతిసారి మరొకరికి అవకాశం ఇస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పరిశీలకుడు నాని, రామ్ గోపాల్ రెడ్డి జగివుల నివాసానికి వెళ్లి జకీ ఉల్లా తో సమావేశమయ్యారు. నాకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని జకీ ఉల్లా ప్రశ్నించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాకు కాదని కొత్త వారికి టికెట్ ఇవ్వడం ఏంటి అని వారికి ఉన్న అర్హతలు ఏమిటి నాకు లేనిది ఏంటి అని ప్రశ్నించారు. అయితే ఆదినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని జక్కివుల డిమాండ్ చేశారు. చంద్రబాబు తో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని జక్కివుల్లా తెలిపినట్లు సమాచారం.