Telangana Congress Manifesto : తెలంగాణకు ప్రత్యేక మేనిపెస్టో - కేంద్రం తరపున కాంగ్రెస్ కీలక హామీలు
Telangana Politics : తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్రంలో అధికారం చేపడితే అమలు చేయబోయే హామీల గురించి వివరించింది.
Elections 2024 : అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలతో పాటు బోలెడన్ని హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రత్యేకంగా ఓ మేనిఫెస్టో రిలీజ్ చేసింది జాతీయ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ - పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో ఓ మేనిఫెస్టో విడుదల చేసింది. దీన్ని తుక్కుగూడలో జరిగిన సభలో తెలుగులోనూ విడుదల చేశారు. అయితే తెలంగాణకు ఏమి చేస్తారో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలనుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏమేమి చేస్తామో వివరిస్తూ.. మేనిపెస్టోను సిద్ధం చేసి.. విడుదల చేశారు.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం - వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ గాంధీభవన్‌లో ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోను యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని వెల్లడించారు. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందిని.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలో కీలక అంశాలు ఉన్నాయి. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు , మేడారం జాతరకు జాతీయ హోదా, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రారంభం, భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం వంటి హామీలు ఉన్నాయి. అాలాగే 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చూడటం, సౌరశక్తి ఉత్పత్తి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు.
ఏపీలో వైసీపీ గెలుపు కోసం కేసీఆర్, కేటీఆర్ మాట సాయం - జగన్ గెలిస్తే బీఆర్ఎస్‌కు లాభం ఏంటి ?
విభజన హామీలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరుపుతామని ప్రకటించారు. రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైను ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీైలను ఇచ్చారు.