అన్వేషించండి

Vizag News: విశాఖ తూర్పు వైసీపీలో ఏమి జరుగుతోంది..? ఆ నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు?

Vishakhapatnam East : తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎంవీవీ సత్యనారాయణను నియమించిన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతలు మౌనం దాల్చారు. ఈ వ్యవహారమే ఇప్పుడు కేడర్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగానే సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, వైసీపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేతలు మధ్య విభేధాలు ఉన్న నియోజకవర్గాలు జాబితాలో విశాఖలోని తూర్పు నియోజకవర్గం ఒకటిగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. కానీ, ఈయనకు స్థానిక నేతలు ఆశించిన స్థాయిలో సహకారాన్ని అందించడం లేదన్న ప్రచారం ఉంది.

గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అక్కరమాని విజయ నిర్మల, ఆయన భర్త వెంకటరావు గడిచిన కొన్నాళ్లు నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భీమిలిలో నిర్వహించిన తొలి సిద్ధం సభకు కూడా ఈ దంపతులు హాజరు కాలేదు. అలాగే, ఇదే నియోజకవర్గ పరిధిలో ఉంటున్న మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు కూడా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో అంటీ, ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఎంవీవీని తూర్పు ఇన్‌చార్జ్‌గా నియమించిన తరువాతే వైసీపీలో కొన్నాళ్లు నుంచి ఉన్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌.. బయటకు వెళ్లిపోయి జనసేనలో చేరారు. ఈ వ్యవహారాలన్నీ తూర్పు వైసీపీలో కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నట్టు కేడర్‌ చెబుతోంది. 

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేకు ధీటైన అభ్యర్థిగా ఎంవీవీ

విశాఖ నగర పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరిస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యే వెలగపూడి చేతిలో రెండు సార్లు వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఒకసారి అక్కరమాని విజయనిర్మల ఓటమి చవి చూశారు. సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వ్యక్తిగత ఇమేజ్‌ ఆయన విజయానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలగపూడిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం.. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించింది.

పార్టీ అప్పగించిన బాధ్యతలు మేరకు ఎంవీవీ సత్యనారాయణ తొలి రోజు నుంచే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌ను కూడా తన వెంట నడిచేలా చేస్తున్నారు. కానీ, ఇంటి పోరు ఆయనకు ఎంత వరకు ఇబ్బందిని కలిగిస్తుందన్నది తెలియడం లేదు. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఇప్పుడు ఒకే వేదికపైకి (కూటమి) చేరినట్టు అయింది. వీరిద్దరిని తట్టుకుని ఢీ కొట్టడం ఎంవీవీ సత్యనారాయణకు అంత సులభమేమీ కాదు. కానీ, వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు కలిసి వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి మాదిరిగానే ప్రజలతో మమేకం కావడం, అందరికీ అందుబాటులో ఉంటాడన్న పేరు తెచ్చుకోవడం కూడా ఎంపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. 

ఆ నేతల ఆలోచన ఏమిటి..?

తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించినప్పటి నుంచి నిరాశలో కూరుకుపోయారు ఇక్కడి తాజా మాజీ ఇన్‌చార్జ్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి. ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ, అధిష్టానం నుంచి ఆ దిశగా హామీ లభించకపోవడంతోపాటు ఎంపీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ మారిపోయారు. పార్టీలోనే ఉన్నప్పటికీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న అక్కరమాని దంపతులు, మేయర్‌ దంపతులు మాత్రం మధ్యస్తంగా మెలుగుతూ రాజకీయాలను నెరుపుకుంటూ పోతున్నారు. తూర్పులో కాకపోయినా గాజువాకలో అయినా అవకాశం ఇవ్వాలని మేయర్‌ దంపతులు అధిష్టానాన్ని కోరుతున్నారు. విశాఖ నగరంలో కీలకమైన తూర్పు నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న అసంతృప్తులను అధిష్టానం ఎంత వరకు సమసిపోయేలా చేస్తుందో.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget