Elections 2024 : హత్యాయత్నం చేయించింది చెవిరెడ్డినే - కీలక వీడియోలు బయట పెట్టిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి
Andhra News : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చెవిరెడ్డే తనపై హత్యాయత్నం చేయించారని స్పష్టం చేశారు.
Puliverthy Nani On Chevireddy : చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కారుపై దాడి చేశారు కానీ హత్యాయత్నం చేయలేదని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పులివర్తి నాని కౌంటర్ ఇచ్చారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యాయత్నంకు సంబంధించిన వీడియో ఆధారాలు మీడియాకూ చిపంచారు.
తుమ్మలగుంట అపరిచితుడు చెవిరెడ్డి
పోలీసులు, జడ్జీలు అవసరం లేని విధంగా తుమ్మలగుంట అపరిచితుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారని.. నానిపై దాడి చేయడానికి రాలేదని చెప్పాడు. మరి ఈ వీడియోలో దృశ్యాలు నిజాం కావా అని పులివర్తి నాని ప్రశ్నించారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ ప్రెస్ మీట్ లో ఏమి చెప్పారో అదే స్క్రిప్ట్ ఎమ్మెల్యే చదివారన్నారు. దాడి చేయించి కూడా ఎమ్మెల్యే అబద్దం చెపుతున్నాడని మండిపడ్డారు. నానిపై హత్యాయత్నం జరగలేదు అని చెబుతున్నాడని.. ఇది నిజం కాదా అని దృశ్యాలను చూపించి ప్రశ్నించారు.
నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతున్న వైసీపీ వర్గీయులు
గొడవలకు నాని కారణమని అన్నాడని..కానీ నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతూనే ఉన్నారని పులివర్తి నాని ఆరోపించారు. సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించాననని... ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ జెండాను వైసీపీ మూకలు కిందపడేసి తొక్కడంతో ఘర్షణ జరిగిందన్నారు. కారులో ఉన్న నా కోడలు,కూతురు పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అదే రోజు 20 మందిపై కేసులు పెట్టించారని విమర్శించారు. 2019లో ఎప్రిల్ 12వ తేదీన తుమ్మలగుంటలో నా భార్య పై దాడి చేయించావు.. ఒంగోలులో మహిళా విఆర్వో ను బెదిరించావు.. మహిళలు గురించి నువ్వు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమ్మెటతో దాడి చేసిన తర్వాత ఏర్పడ్డ గాయాలు ఇవిగో అని నాని మీడియాకు చూపించారు.
ధైర్యంగా పోరాడతా !
నా ధైర్యం నీ గుండెకు తెలుసని చెవిరెడ్డిని ఉద్దేశించి పులివర్తి నాని ్న్నారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా , దొంగ ఓట్లు తొలగించాలని రెండు సార్లు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టానని గుర్తు చేశారు. ఆమరణ దీక్షను భగ్నం చేయడానికి ఎస్సీలను అడ్డం పెట్టుకున్న నీచ సంస్కృతి నీదని గుర్తు చేశారు. దీక్ష కొనసాగించడానికి, ప్రజల సంక్షేమం కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానన్నారు. 15 ఎళ్లకు నీ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేత దొంగ ఓటు వేయించిన ఘనత నీదని విమర్శించారు. నీకు సహకరించిన అప్పటి ఆర్డీవోలు కిరణ్, కనకనరసా రెడ్డి, 5 మంది తహశీల్దార్ ల బాగోతం బయటకు వస్తుందని హెచ్చరించారు.
రిగ్గింగ్ లేకుండా పోలింగ్
వెబ్ కాస్టింగ్ కారణంగా దొంగ ఓట్లు వేయించలేక పోయామన్న బాధలో ఉన్నావని.. పులివర్తి నాని సెటైర్ వేశారు. 395 బూతులో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజాస్వామ్యన్ని రక్షించారు.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్లుగా ప్రెస్ మీట్ పెట్టలేదని అంటున్నావు.. నాపై గంజాయి, ఎర్రచందనం, కబ్జాలు, ఇసుక వ్యాపారం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు అని సవాల్ చేశారు. నాకు ఉండేది ఒకటే క్వారీ.. దాన్నికి కూడా రూ.50 కోట్లు పెనాల్టీ వెయించి మూత వేయించావని.. ఫ్యాక్టరీ కి రూ. 3.5 కోట్లు పెనాల్టీ వెయించావు.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశావన్నారు.