అన్వేషించండి

Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు నీరుగార్చేశారు - రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

Telangana News : ఫోన్ ట్యాపింగ్ కేసును బలహీనపర్చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇందులో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారన్నారు.

Telangana BJP : ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని..  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై  బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ ఆరోపించారు.  గతంలో కేసీఆర్ మాదిరిగానే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారన్నారు.  అతిపెద్ద ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ కేసు అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేశారు. 

ఓ మంత్రితో చీకటి ఒప్పందం

వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని..  గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది .. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్ లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.   కేసీఆర్ కుటుంబమిచ్చే సలహా సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పని చేస్తున్నారని.. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని నిందితుడు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారని  గుర్తు చేసారు. 

కేసీఆర్ చెబితేనే చేశానని రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్

 రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ కన్ఫెష సర్టిఫైడ్ కాపీని  బండి సంజయ్ మీడియాకు ప్రదర్శించారు.  ఫోన్ ట్యాపింగ్ లో తాను, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన బాధితులమని ఆయన గుర్తు చేశారు.    ప్రజా సమస్యలపై పోరాడింది, ఫాంహౌజ్ నుండి ధర్నా చౌక్ కు కేసీఆర్ గుంజుకొచ్చేలా చేశాననే కోపంతో నన్ను టార్గెట్ చేశారన్నారు.  ఒక అధికారి నా వద్దకు వచ్చి నాతోపాటు మా కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని చెప్పారని..  నేను వాడే సిమ్ కార్డును డూప్ సిమ్ తీసుకుని నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారన్నారు.  మా ఇంటి వద్దనున్న పెట్రోల్ బంక్ సమీపంలో, టెంపుల్ సమీపంలో వాహనాలను ఉంచి ఫోన్ ట్యాప్ చేశారని  ఆరోపించారు.  అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు కరీంనగర్ లో మకాం వేసి మా ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. 

ప్రతిమ హోటల్‌లో రాధాకిషన్ రావు  మకాం 

రాధాకిషన్ రావు ప్రతిమ హోటల్ లోని 314 రూంలో ఉంటూ  తన ఫోన్  తో పాటు  పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడంతో వాళ్లు పైసలు పట్టుకున్నారని గుర్తు చేశారు.  ఇదంతా కేసీఆర్ తో జిల్లా మంత్రి కుమ్కక్కై సాగించిన కుట్ర  ఇదన్నారు.  ఫోన్ ట్యాపింగ్ అసలు నిందితుడు, ప్రభాకర్ రావు వియ్యంకుడి ద్వారా ఈ తతంగమంతా నడిపారన్నారు. అసలు కథ ఏందంటే ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్దిక లావాదేవీలు నడిపిస్తున్నారని స్పష్టం చేసారు.  కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ కు టిక్కెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రాన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదు.. ఆయన కార్యకర్త కానేకాదు... ఏనాడు ఉద్యమాల్లో పాల్గొనలేదు..అసెంబ్లీ ఎన్నికల నుండే రాజేందర్ రావును ప్రభాకర్ రావు తెర ముందుకు తీసుకొచ్చారన్నారు. 

డబ్బులు ఇచ్చినందుకే టిక్కెట్ 

కోట్ల రూపాయలు రాజేందర్ రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధులకు డబ్బులు ఇప్పించారని బండి సంజయ్ ారోపించారు.  రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారని..  కరీంనగర్ పార్లమెంట్ టిక్కెట్ వేరొకరు ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు సీఎంకు పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ ఈ తతంగం నడపడంవల్లే ఆయనకు టిక్కెట్ రాలేదన్నారు.  కాంగ్రెస్ నాయకత్వానికి ఈ విషయం తెలియదా? డబ్బులు ముట్టజెప్పారనే దీనిపై స్పందించడం లేదా? చెప్పాలన్నారు.  కేసీఆర్ ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత కూడా ఇప్పటి వరకు కేసీఆర్ పై చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన బౌలర్ అశ్విన్ రవిచంద్రన్రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Embed widget