Mlc Elections Counting : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంపై ఉత్కంఠ!
Mlc Elections Counting : తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
Mlc Elections Counting : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏపీలో తొమ్మిది, తెలంగాణలో ఒక స్థానానికి ఇటీవల ఎన్నికల జరిగాయి. వీటి కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 12709.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ పై ఉత్కంఠ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సుమారుగా 15 వరకు ఓట్లు తక్కువగా నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. 28 టేబుల్ ఏర్పాటు, ఒక్కొక్కటి 25 చొప్పున 40 కట్ల చొప్పున, వెయ్యి ఓట్లు ఒక టేబుల్ పై లెక్కిస్తున్నారు. 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో రౌండ్ కి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందని అంచనా. హైకోర్టులో దీనిపైన కేసు వేసిన నేపథ్యంలో తుది ఫలితం వెల్లడిస్తారా లేదా అనే సందేహం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ రెండో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌రావు విజయం సాధించారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 48 గంటలు పడుతుందని అంచనా. ఆరు జిల్లాల్లో కలిపి 2 లక్షలకు పైగా ఓట్లు వేశారు. 2007, 2011, 2017లలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రెండో ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు గెలిచారు. ఈసారి కూడా ఆ ఓటే కీలకం కానుందని సమాచారం. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో 500 మంది ఎన్నికల సిబ్బంది నాలుగు టీమ్‌లుగా ఏర్పడి విడతల వారీగా ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. ఏడు రౌండ్లలో 2,00,926 ఓట్లు లెక్కింపునకు కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుందని అంచనా.
ఈ 5 స్థానాల్లో ఏకగ్రీవం