అన్వేషించండి

Ap High Court: పోస్టల్ బ్యాలెట్ అంశంపై పిటిషన్ - వైసీపీకి హైకోర్టులో చుక్కెదురు, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన!

Andhra Pradesh News: పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి వైసీపీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Ap High Court Dismissed Ysrcp Petition On Postal Ballot Issue: పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) చెల్లుబాటుపై సీఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు (AP High Court) తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్ కు అర్హత ఉందన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శనివారం తీర్పు వెలువరించింది.

వైసీపీ అభ్యంతరం ఏంటంటే.?

ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి 'ఫాం - 13ఏ'పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీల్ (అధికారిక ముద్ర) లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీటిని సవాల్ చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును శనివారం వెలువరించింది.

ఈసీ వాదనేంటి అంటే.?

'ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు. ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. అధికరణ 329(బి) ప్రకారం ఎన్నికలు సవాల్ చేయాలంటే కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సాధ్యం. ఎలాంటి సందర్భాల్లో ఎన్నిక చెల్లుబాటు కాదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఈ పిటిషన్ కు అర్హత లేదు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారు. ఫాం 13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. ఆ అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా వీడియో రికార్డైంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫాం 13ఏ పై మాత్రం ఆర్ఓ నియమించిన అధికారే అటెస్టేషన్ చేశారు. ఈ క్రమంలో దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు' అని ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు.

వైసీపీ వాదనేంటి అంటే.?

'ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. గెలుపోటములను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా పరవాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు నిబంధనలు మార్చే అధికారం ఈసీకి లేదు. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల నిబంధనలు సవరించడానికి వీల్లేదు. ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్దంగా ఈసీ చర్యలున్నాయి. ఈపీ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదన సరికాదు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు నిలిపేయాలి.' అని పిటిషనర్ అప్పిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget