Anantapur Lok Sabha Election Results 2024: అనంతపురం జిల్లాలో దూసుకెళ్లిన సైకిల్- కొట్టుకుపోయిన ఫ్యాన్
Anantapur Lok Sabha Winner List 2024:తాడిపత్రిలాంటి నియోజకవర్గం ఉన్న అనంతపురం జిల్లా దేశంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. అన్నింటినీ దాటుకొని కూటమి అనంతలో జెండా ఎగరేసింది.
![Anantapur Lok Sabha Election Results 2024: అనంతపురం జిల్లాలో దూసుకెళ్లిన సైకిల్- కొట్టుకుపోయిన ఫ్యాన్ Anantapur District Lok Sabha Election Results 2024 MP Winners List All Constituency Election Results Anantapur Lok Sabha Election Results 2024: అనంతపురం జిల్లాలో దూసుకెళ్లిన సైకిల్- కొట్టుకుపోయిన ఫ్యాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/b1dba399e2365bc9696d06e385327c3e1717492985920215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anantapur MP Winner List 2024: అనంతపురం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరేసింది. కూటమిగా పోటీ చేసి వైసీపీని మట్టికరిపించింది.
|
నియోజకవర్గం |
విజేత |
1 |
శింగనమల |
బండారు శ్రావణి |
2 |
కళ్యాణదుర్గం |
ఇంకా కౌంటింగ్ మొదలు కాలేదు |
3 |
ఉరవకొండ |
అమిలినేని సురేంద్రబాబు |
4 |
తాడిపత్రి |
జేసీ అస్మిత్ రెడ్డి |
5 |
గుంతకల్లు |
గుమ్మనూరు జయరామ్ |
6 |
రాయదుర్గం |
కాలవ శ్రీనివాసులు |
7 |
అనంతపురం అర్బన్ |
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ |
రాయలసీమ ప్రాంతంలోని అత్యంత కీలకమైన జిల్లా అనంతపురం. ఈ జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకొని తన పట్టును నిలుపుకుంది. అయితే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎక్కడ వైసిపి ఘన విజయాన్ని నమోదు చేసింది. విభజిత అనంతపురం జిల్లాలో ఒకే ఒక్క స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో గెలుచుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ హోరాహోరి పోరు నడిచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అనంతపురం జిల్లా అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రాప్తాడు నియోజకవర్గం హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలోకి ఉండగా మిగిలిన ఏడు నియోజకవర్గాలు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ గెలుచుకుంది. మొత్తం ఆరు స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఉరవకొండ స్థానాన్ని మాత్రమే వైసిపి గెలుచుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి జిల్లాలో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏడు స్థానాల్లో ఉరవకొండ మినహా మిగిలిన ఆరు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఎవరు గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 80.80 శాతం ఓటింగ్ నమోదు కాగా తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది 81.10 శాతం ఓటింగ్ నమోదయింది. దీంతో ఈ జిల్లాలో ఫలితాలు పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.
అనంతపురం జిల్లా
|
2009 |
2014 |
2019 |
శింగనమల |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
కళ్యాణదుర్గం |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
ఉరవకొండ |
టీడీపీ |
వైసీపీ |
టీడీపీ |
తాడిపత్రి |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
గుంతకల్లు |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
రాయదుర్గం |
కాంగ్రెస్ |
వైసీపీ |
|
అనంతపురం అర్బన్ |
వైసీపీ |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)