News
News
X

ఫుల్‌ క్రీమ్‌, డబుల్‌ టోన్డ్‌ మిల్క్ అంటే ఏంటి? వీటిని ఎలా తయారు చేస్తారు?

ఇప్పుడు పాలు రకరకాల మార్గాల్లో ఇళ్లకు చేరుతున్నాయి. వాటిలో ప్యాకెట్‌ పాలు చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి. మార్కెట్లో అనేక రకాల ప్యాకేజ్డ్ పాలు అందుబాటులో ఉన్నాయి.

FOLLOW US: 
 
పాలు వల్ల శక్తి వస్తుందని... పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుతున్నాం.  ఆరోగ్యం బాగుండాలంటే రోజూ పాలు తాగాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. శరీరంలో కాల్షియం లోపాన్ని పాలు నయం చేస్తాయని వైద్యులు కూడా చెబుతున్న మాట. మొత్తంమీద, పాలు తాగడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంతా చెబుతున్నారు. 

ఇప్పుడు ఆ పాలు రకరకాల మార్గాల్లో ఇళ్లకు చేరుతున్నాయి. వాటిలో ప్యాకెట్‌ పాలు చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి. మార్కెట్లో అనేక రకాల ప్యాకేజ్డ్ పాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పాలలో వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు ఉన్నట్టు ప్యాకెట్లపై కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఏ పాలలో ఏది దొరుకుతుందో, మీరు తాగడానికి ఏ పాలు సరైనవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ 

ఫుల్ క్రీమ్ మిల్క్‌లో చిక్కటి క్రీమ్ ఉంటుంది. ఈ పాలలో మొత్తం ఫ్యాట్‌ ఉంటుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి ఈ పాలను వివిధ పద్దతుల్లో పాశ్చరైజ్ చేస్తారు. ఫుల్‌ క్రీమ్ మిల్క్‌ ముఖ్యంగా పిల్లలు, యువత, బాడీబిల్డర్లకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. వారు శక్తి కోసం ఈ పాలు తాగాలి. ఒక గ్లాసు ఫుల్ క్రీమ్ మిల్క్‌లో 3.5 శాతం కొవ్వు ఉంటుంది.  150 కేలరీలు ఉంటాయి. ఫుల్‌ క్రీమ్ మిల్క్‌లో క్రీము ఉంటుంది అందుకే ఎక్కువ రుచికరంగా ఉంటాయి. ఫుల్‌ క్రీమ్‌ పాలు రెండు రకాలు. ఒకటి స్టాండర్డైజ్డ్‌ పాలు. రెండోది హోమోజెనైజ్డ్‌ మిల్క్‌. మొదటి రకం పాలులో కనీసం 3.5 శాతం కొవ్వు ఉంటుంది. 

News Reels

సింగిల్ టోన్డ్ మిల్క్

హోల్ మిల్క్‌, స్కిమ్డ్‌ మిల్క్‌ రెండు కలిపి తయారు చేస్తారు. నీళ్లు, స్కిమ్డ్‌ మిల్క్‌ను హోల్‌ మిల్క్‌తో కలిపి తయారు చేసిన పాలే సింగిల్ టోన్డ్ మిల్క్. ఈ పాలలో దాదాపు 3 శాతం కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ పాలు పోషకాలు కూడా కలిగి ఉంటుంది. ఒక గ్లాసు టోన్డ్ మిల్క్ దాదాపు 120 కేలరీలు కలిగి ఉంటుంది.

డబుల్ టోన్డ్ మిల్క్

హోల్‌ పాలలో నేరుగా స్కిమ్డ్ మిల్క్‌ను కలిపి డబుల్ టోన్డ్ మిల్క్ తయారు చేస్తారు. ఇందులో దాదాపు 1.5 శాతం కొవ్వు ఉంటుంది. వర్కౌట్స్ చేసే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పాలు కేలరీల పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్కిమ్డ్ మిల్క్ అంటే ఏమిటి?

స్కిమ్డ్ మిల్క్‌లో 0.3 నుంచి 0.1 శాతం కొవ్వు ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్‌లో విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాలు ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ మీకు ఫుల్‌ క్రీమ్ మిల్క్‌లో సగం కేలరీలను (సుమారు 75 కేలరీలు) ఇస్తుంది. ఇందులో ఏ విటమిన్లు లాంటివి చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది.

Published at : 13 Oct 2022 01:58 PM (IST) Tags: Full Cream Milk Single Toned Milk Double Toned Milk skimmed milk

సంబంధిత కథనాలు

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!