అన్వేషించండి

UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!

UPSC Prelims 2026: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 దరఖాస్తులను ఏఐ రివ్యూ చేసింది. యూపీఎస్సీ తొలిసారిగా వినియోగించిన ఏఐ విశ్లేషణలో 569 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ దరఖాస్తులను పరిశీలించడానికి AIని ఉపయోగించింది.
  • నిబంధనలు పాటించని 569 దరఖాస్తులను AI గుర్తించి తిరస్కరించింది.
  • పరీక్షకు ముందే ఫేస్ ఐడెంటిఫికేషన్, ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి చేశారు.

UPSC Prelims 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మరింత పారదర్శకంగా చేయడానికి కొత్త సాంకేతికతను ఉపయోగించింది. దరఖాస్తులను పరిశీలించడానికి కమిషన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించింది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించింది. పరీక్ష ప్రారంభం కావడానికి ముందే రూల్స్‌ బ్రేక్ చేసిన వారి ఫారాలన్నింటినీ తిరస్కరించింది. 

15 ఏళ్ల రికార్డుల సహాయంతో దర్యాప్తు జరిగింది

దరఖాస్తులను ధృవీకరించడానికి గత 15 సంవత్సరాల రికార్డులు, డేటాను ఉపయోగించినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఏఐ (AI) సహాయంతో, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించడం, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తును నింపడం వంటి కేసులను గుర్తించారు. ధృవీకరణ పూర్తైన తర్వాత, అటువంటి దరఖాస్తులన్నింటినీ రద్దు చేశారు.

తొలిసారిగా ఫేస్‌ ఐడెంటిఫికేషన్

ఈ సంవత్సరం, యూపీఎస్సీ పరీక్షా విధానంలో మరో ప్రధాన మార్పు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి సుమారు 30 నిమిషాల ముందు, అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఫేస్‌ ఐడెంటిఫికేషన్ చేశారు. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ నుంచి లైవ్‌లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయడాన్ని కూడా తప్పనిసరి చేశారు, తద్వారా వేరొకరు పరీక్ష రాసే అవకాశం లేకుండా చేశారు. 

Also Read: సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి కలిగి ఉన్న పిడుగు వెనుక ఉన్న రహస్యాలివే!

ఆధార్ నంబర్ ద్వారా గుర్తింపు 

అభ్యర్థులకు స్వచ్ఛందంగా తమ ఆధార్ నంబర్‌ను అందించే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది. దాదాపు 94 శాతం మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ ఆధార్ నంబర్‌ను అందించారు. దీనివల్ల గుర్తింపు ధృవీకరణ సులభమైంది. దరఖాస్తు ధృవీకరణ సరళీకృతమైంది.

కేటగిరి మార్చిన వారికి సమాచారం 

కేటగిరీని ఎందుకు మార్చుకున్నారో వివరించాలని చెబుతూ, యూపీఎస్సీ సుమారు 43,497 మంది అభ్యర్థులకు ఇమెయిల్స్ పంపింది. కేటగిరీని మార్చడం వల్ల అభ్యర్థి అటెంప్ట్స్‌ సంఖ్యపై ప్రభావం పడొచ్చని కమిషన్ వివరించింది. అందువల్ల, తమ కేటగిరీని మార్చుకున్న అభ్యర్థులను అందుకు స్పష్టమైన కారణం చెప్పమని కోరింది. 

Also Read: చీకటిలో మనుషులు కూడా మెరుస్తారు! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

అవకతవకలు ఇప్పటికే గుర్తింపు

గతంలో, ఇంటర్వ్యూలు లేదా పత్రాల ధృవీకరణ సమయంలో అనేక ఉల్లంఘనలు గుర్తించేవారు. అయితే, ఏఐ, డిజిటల్ ధృవీకరణ సహాయంతో, ఇప్పుడు అటువంటి అవకతవకలు పరీక్షకు ముందే గుర్తిస్తున్నారు. దీనివల్ల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, విశ్వసనీయంగా మారుతుందని ఆశిస్తున్నారు.

ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు?

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 కోసం దాదాపు 8.18 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో, దాదాపు 4.49 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. AI-ఆధారిత ధృవీకరణ, కొత్త భద్రతా వ్యవస్థల ద్వారా, పరీక్షా ప్రక్రియను మరింత నిష్పక్షపాతంగా, సురక్షితంగా మార్చే దిశగా కమిషన్ ఒక కీలకమైన అడుగు వేసింది.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1 జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
2 యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
3 జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?
4 బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?
5 చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?

Frequently Asked Questions

UPSC 2026 ప్రిలిమినరీ పరీక్షలో ఏ కొత్త సాంకేతికతను ఉపయోగించింది?

యూపీఎస్సీ 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో దరఖాస్తులను పరిశీలించడానికి మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించింది. ఇది పరీక్ష ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి సహాయపడుతుంది.

AI ద్వారా ఎన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి?

AI సహాయంతో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించి, పరీక్ష ప్రారంభం కావడానికి ముందే వాటిని తిరస్కరించారు. ఇది ఒకే అభ్యర్థి ఎక్కువ దరఖాస్తులు లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి గుర్తించింది.

2026 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రవేశానికి కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధన ఏమిటి?

ఈ సంవత్సరం, పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభం కావడానికి సుమారు 30 నిమిషాల ముందు అభ్యర్థులు ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయించుకోవాలి. అప్లికేషన్ నింపేటప్పుడు లైవ్ ఫోటో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు.

అభ్యర్థులు తమ ఆధార్ నంబర్ అందించడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి?

అభ్యర్థులు తమ ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా అందించే అవకాశం కల్పించారు. దాదాపు 94% మంది అభ్యర్థులు దీన్ని ఉపయోగించడంతో, గుర్తింపు ధృవీకరణ సులభమైంది మరియు దరఖాస్తు ధృవీకరణ సరళీకృతమైంది.

టాప్ హెడ్ లైన్స్

JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Embed widget