(Source: ECI/ABP News/ABP Majha)
UOH Admissions: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 సీట్లను భర్తీచేస్తారు.
University of Hyderabad MBA Notification: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 సీట్లను భర్తీచేయనున్నారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్-2023 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రవేశాలు - 2024
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 75.
విభాగాలు..
➥ మార్కెటింగ్
➥ ఫైనాన్స్
➥ ఆపరేషన్స్
➥ హ్యూమన్ రిసోర్సెస్
➥ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
➥ బిజినెస్ అనలిటిక్స్
➥ బ్యాంకింగ్
అర్హత: ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్-2023 ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ప్రవేశ విధానం: క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.01.2024.
➥ ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/మార్చి 2024.
➥ ప్రవేశ ప్రక్రియ ముగింపు: మార్చి చివరివారం నాటికి.
➥ తరగతులు ప్రారంభం: జులైలో.
ALSO READ:
ఐఐటీ మద్రాస్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2023 అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విదేశీ విద్యార్థులైతే సీమ్యాట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బిట్స్ పిలానీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష (బిజినెస్ అనలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్-BAAT), పర్సనల్ ఇంటర్వ్యూ (లేదా) క్యాట్ (CAT) 2023/ ఎక్స్‌ఏటీ (XAT) 2024/ జీమ్యాట్ (GMAT) 2023, అకడమిక్ మెరిట్, పని అనుభవం తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.