TS EAMCET 2023 Answer Key: ఎంసెట్ ఇంజినీరింగ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 15న సాయంత్రం విడుదల చేశారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో మే 12,13,14 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 15న సాయంత్రం విడుదల చేశారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 15న సాయంత్రం 8 గంటల నుంచి మే 17న సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వెబ్ లింక్ ద్వారా తెలియజేయవచ్చు.
మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ (ఇంజినీరింగ్ స్ట్రీమ్):
12 May 2023 FN (English & Telugu)
12 May 2023 AN (English & Telugu)
13 May 2023 FN (English & Telugu)
13 May 2023 AN (English & Telugu)
14 May 2023 FN (English & Telugu)
14 May 2023 AN (English & Telugu)
14 May 2023 AN (English & Urdu)
Download Response Sheet (E & AM)
EAMCET Key Objections (E & AM)
వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్, మెడికల్ ఆన్సర్ కీ..
టీఎస్‌ఎంసెట్-2023 అగ్రికల్చర్ & మెడికల్ స్ట్రీమ్ ఆన్సర్ కీని మే 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై మే 14న సాయంత్రం 6 గంటల నుంచి మే 16న సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా మే 16న సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి.
హాజరు 94.11 శాతం..
ఈసారి ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌కు మొత్తం 3,20,683 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,01,789 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 65,871 మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 12,561 మంది విద్యార్థులు పరీక్షలకు రాయలేదు. ఇక ఏపీ నుంచి 6,333 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.
మే చివరివారంలో ఫలితాలు..
మే 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలను మే చివరివారంలో విడుదలచేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు మే 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.
Also Read:
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్, పారామెడికల్ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
దామోదర్ వ్యాలీలో 52 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
కోల్‌కతా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పశ్చిమ్ బెంగాల్ లేదా ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు మరియి స్టేషన్లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది..