News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Inter Exams: ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

తెలంగాణలో జూన్ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది హాజరుకానున్నారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో జూన్ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది,  ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్ లేదా పాత హాల్‌టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. 

First Year Hallticket

Second Year HallTicket

Bridge Course HallTicket

ఇంట‌ర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇదే..:
ఈ ఏడాది జులై 12 నుంచి 20 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షల షెడ్యూలు..

➥ జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1

➥ జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లిష్‌

➥ జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-1(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్

➥ జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-1(బి), జువాల‌జీ, హిస్టరీ

➥ జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్

➥ జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్

➥ జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)

➥జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫ

ఇంటర్ సెకండియ‌ర్ ప‌రీక్షల షెడ్యూలు..

➥ జూన్ 12 (సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2

➥ జూన్ 13 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌-2

➥ జూన్ 14 (బుధ‌వారం) – మ్యాథ్స్-2(ఎ), బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్

➥ జూన్ 15 (గురువారం) – మ్యాథ్స్-2(బి), జువాల‌జీ, హిస్టరీ

➥ జూన్ 16 (శుక్రవారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్

➥ జూన్ 17 (శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్

➥ జూన్ 19 (సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)

➥ జూన్ 20 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

Also Read:

'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 09 Jun 2023 03:58 PM (IST) Tags: Education News in Telugu TSBIE Inter ASE Schedule TS Inter Exams Halltickets Inter Supply Exams Dates TS Inter Supplimentary Exams Halltickets Telangana Inter supplimentary Exams

ఇవి కూడా చూడండి

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

టాప్ స్టోరీస్

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు