అన్వేషించండి

TS Inter Results: ఇంటర్‌ మార్కుల మెమోలు అందుబాటులో, ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

TSBIE: ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ వివరాలు నమోదు చేసి షార్ట్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్  పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను (Marks memo) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ విద్యాసంవత్సరం, కేటగిరీ, హాల్‌టికెట్ నంబర్ వివరాలు నమోదు చేసి షార్ట్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణ ఇంటర్ షార్ట్ మెమోల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) వెలువడ్డాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారని అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ తోపాటు ఏబీపీ దేశంవెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. 

ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు.

బాలికలదే పైచేయి..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లో 2,62,829 మంది రెగ్యూలర్ విద్యార్థులు పాస్ కాగా, ఒకేషనల్ విద్యార్థులు 24,432 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా ఇంటర్ ఫస్టియర్ లో 2,87,261 మంది పాసయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 61.06 శాతం పాస్ కాగా, వీరిలో బాలికలు 1,49,331 మంది ఉండగా, బాలురు 1,13,498 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 68.59 శాతం పాస్ కాగా, బాలురు 53.36 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 48 మంది రెగ్యూలర్ విద్యార్థులు, ఇద్దరు ఒకేషనల్ విద్యార్థులలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 25 నుంచి కౌంటింగ్, రీవెరిఫికేషన్..
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి అగ్రస్థానంలో నిలవగా, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకూడదని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు.  మే 24వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

ఇంటర్ పాసైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, అవసరమైతే ప్రింటౌట్ తీసుకుని వారి వద్ద భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పేపర్ రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్ కు రూ.100 చెల్లించాలని అధికారులు సూచించారు. అదే విధంగా వాల్యుయేషన్ చేసిన పేపర్ స్కాన్ కాపీతో పాటు రీ వెరిఫికేషన్ కోసం రూ.600  ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో మే2వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget