అన్వేషించండి

TS Scholarships: ఫీజు రీయింబెర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

తెలంగాణలో బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉపకారవేతనాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పెంచినట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి రెన్యువల్‌, ఫ్రెష్‌ విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ-పాస్‌ వెబ్‌‌సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 15 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వీరే అర్హులు..
SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. 

అవసరమైన డాక్యుమెంట్లు..
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తు చేసుకునే విద్యా్ర్థులు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థుల క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కుల షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి. 

అధికారిక వెబ్‌సైట్

:: Related Article ::

మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు
తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు, ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.
Website


మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Embed widget