అన్వేషించండి

TS PGECET 2022 Counselling: ప్రారంభమైన పీజీఈసెట్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సెప్టెంబరు 30లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తొలుత గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయించనున్నారు.

తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 19న ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు తమ సెప్టెంబరు 30లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 232 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 9131 సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలుత గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయించనున్నారు. పీజీఈసెట్‌ పరీక్షలో 11,520 మంది, గేట్‌/జీపీఏటీ పరీక్షలో 411 మంది మొత్తం 11931 మంది అర్హత సాధించారు. కౌన్సెలింగ్ ఫీజు కింద అభ్యర్థులు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.


తెలంగాణలో ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఫలితాలను సెప్టెంబర్ 3న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. పీజీ ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికీ వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.  


తెలంగాణ పీజీఈసెట్‌ను ఆగ‌స్టు 2 నుంచి 5 వరకు నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఈ ప‌రీక్షల‌ను నిర్వహించింది. పీజీఈసెట్-2022 పరీక్షలో మొత్తం 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో 6,440 మంది (55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది పాస్ అవడం విశేషం. మిగిలిన 6,334 మంది ఇతర 18 విభాగాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఏడు విభాగాల్లో అమ్మాయిలు టాపర్లుగా నిలిచారు.

PGECET 2022 Ranck Card ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1) అభ్యర్థులు మొదటగా pgecet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
2) “Download rank card” లింక్ పై క్లిక్ చేయండి.
3) పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు వివరాలను ఎంటర్ చేయాలి.
4) సబ్ మిట్ చేసిన తర్వాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
5) డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు.
6) కౌన్సెలింగ్ లో ర్యాంక్ కార్డు తప్పనిసరి.

Download Here: TS PGECET - 2022 RANKCARD


తెలంగాణ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


1. కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 16.09.2022 

2. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల స్కానింగ్: 19.09.2022 to 02.10.2022 

3. స్లాట్ బుకింగ్ ద్వారా స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ (NCC / CAP / PH / Sports): 22.09.2022 to 24.09.2022 

4. అభ్యర్థుల వెరిఫికేషన్ లిస్ట్, ఈమెయిల్ ద్వారా సవరణలు: 04.10.2022 

5.  వెబ్‌ఆప్షన్లు (ఫేజ్-1): 07.10.2022 to 09.10.2022 

6.  వెబ్‌ఆప్షన్ల ఎడిట్ (ఫేజ్-1): 10.10.2022 

7. కాలేజీల వారీగా అభ్యర్థుల ప్రాథమిక జాబితా ప్రకటన (ఫేజ్-1): 12.10.2022 

8. సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు: 12.10.2022 to 15.10.2022 

9. తరగతుల ప్రారంభం: 17.10.2022 

Counselling Notification

Counselling Website

 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget