టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు, చివరితేది ఎప్పుడంటే?
లాసెట్ గడువును ఏప్రిల్ 29 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని లాసెట్ కన్వీనర్ తెలిపారు.
టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. లాసెట్ గడువును ఏప్రిల్ 29 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశంగా లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మీ ఏప్రిల్ 20న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకొని తమకు దగ్గర్లోని సెంటర్‌ను ఎంచుకోవాలని సూచించారు. ఓపెన్ అభ్యర్థులకు రూ.900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పిచారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న లాసెట్, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
వివరాలు...
* టీఎస్‌లాసెట్ - 2023
కోర్సుల వివరాలు..
1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- ఎల్‌ఎల్‌బీ
- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- బీఏ ఎల్‌ఎల్‌బీ
- బీకామ్ ఎల్‌ఎల్‌బీ
- బీబీఏ ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: లాసెట్, పీజీఎల్ సెట్ ర్యాంకు ఆధారంగా.
దరఖాస్తు ఫీజు:
➦ లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం, మార్కులు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష అర్హత మార్కులు:
➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
➥ పీజీఎల్‌సెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06-04-2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 12-04-2023.
➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 19-04-2023.
➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 26-04-2023.
➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 03-05-2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04-05-2023 నుంచి 10-05-2023 వరకు.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16-05-2023.
➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 25-05-2023.
➥ ప్రాథమిక కీ విడుదల: 29-05-2023.
➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 31-05-2023 (5 PM)
➥ తుది కీ, ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.
Notification
Online Application
Also Read:
టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సీయూఈటీ పీజీ - 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..