అన్వేషించండి

TS EAMCET: జులై 16న ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలు, ఫేజ్-2 ఎప్పటినుంచంటే?

తెలంగాణ ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలు జులై 16న విడుదల కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ఫలితాలు జులై 16న విడుదల కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అయితే అలాట్‌మెంట్ ఫలితాలను ప్రాసెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌లోని కొన్ని విభాగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తిరిగి వెబ్‌సైట్‌లోని అన్ని విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాట్‌మెంట్ జాబితాలో అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాల, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్‌ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరి నుంచి మొత్తం 49,42,005 ఆప్షన్లు నమోదయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 1,109 ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. అభ్యర్థులకు జులై 16న సీట్లు కేటాయించనున్నారు. 

అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).

➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌.

➥ జులై 24 – జులై 27: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 31: సీట్ల కేటాయింపు.

➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆగ‌స్టు 8: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).

➥ ఆగ‌స్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌. 

➥ ఆగ‌స్టు 4 - ఆగ‌స్టు 6 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ ఆగ‌స్టు 9: సీట్ల కేటాయింపు.

➥ ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

స్పాట్ ప్రవేశాలు...

స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget