News
News
వీడియోలు ఆటలు
X

TS EAMCET 2023: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌, నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ' - తొలిరోజు పరీక్షలు రాయనున్న 57,577 మంది విద్యార్థులు!

తెలంగాణ ఎంసెట్ బుధవారం (మే 10) నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగం రెండు విడతల పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం 57,577 మంది హాజరుకానున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఎంసెట్ బుధవారం (మే 10) నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగం రెండు విడతల పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం 57,577 మంది హాజరుకానున్నారు. ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది రాయనున్నారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మందికి స్లాట్లు కేటాయించామని ఎంసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌కు తెలంగాణలో 95, ఏపీలో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ ప్రవేశ‌ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్ బి. డీన్ కుమార్ విద్యార్థులకు కీల‌క ఆదేశాలు జారీచేశారు. 

మే 10 నుంచి 14 వరకు, ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉద‌యం 9 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం వేళ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు తెలంగాణ వ్యాప్తంగా 104 సెంట‌ర్లు, ఏపీలో 33 సెంట‌ర్లను ఏర్పాటు చేసిన‌ట్లు క‌న్వీన‌ర్ తెలిపారు. ఎంసెట్ ఎగ్జామ్స్ స‌జావుగా జ‌రిగేందుకు ఎస్‌పీలు, సీపీలు, విద్యుత్ అధికారులు, ఆర్టీసీ అధికారులు స‌హ‌కారం అందించాల‌ని క‌న్వీన‌ర్ కోరారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

TS EAMCET 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్షలకు ఏరోజు ఎంతమంది?

పరీక్ష తేదీ  విద్యార్థుల సంఖ్య
మే 10 57,577
మే 11 57,754
మే 12 68,748
మే 13 69,017
మే 14 67,588

గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు..
ఎంసెట్ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ప‌రీక్షా స‌మయానికే ఒక గంట ముందుగానే చేరుకోవాల‌ని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ హాల్‌టికెట్‌పై పొందుప‌రిచిన నిబంధ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు కేటాయించిన తేదీ, స‌మ‌యంలోనే ప‌రీక్షల‌కు అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఆ స‌మ‌యానికి అటెండ్ కాక‌పోతే.. ఇత‌ర సెష‌న్లకు అనుమతించే ప్రస‌క్తే లేద‌ని ఆయన స్పష్టం చేశారు.

ఎంసెట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 137 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు!
తెలంగాణ ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ పరిశీలకుడిని నియమించారు. మే 10 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ పరీక్ష పర్యవేక్షణకు గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్‌ పరిశీలకుడు ఉండగా.. ఈ సారి సిట్టింగ్‌ స్క్వాడ్‌ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్‌కూ ఓ పరిశీలకుడు ఉండనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్‌ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్‌కు 29 పరీక్షా కేంద్రాలు పెంచారు. 

ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఆన్‌లైన్‌ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేసేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు..
ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ ప్రాంగణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో బీటెక్‌ బయో టెక్నాలజీ బ్రాంచీని ప్రవేశ పెడుతున్నారు. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉండనుంది. అదేవిధంగా కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయి.  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 10 May 2023 07:20 AM (IST) Tags: Education News in Telugu TS EAMCET 2023 TS EAMCET 2023 Exam Dates TS EAMCET 2023 Exam Schedule TS EAMCET 2023 Hall Tickets

సంబంధిత కథనాలు

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి